392
వే ము ల వా డ భీ మ క వి
భావించి స్తుతించియుండరు పదునేడవ శతాబ్దాది నుండియుఁ గవులనేకులు తమ గ్రంథాదిని భీమకవిని పూర్వకవి స్తుతిలోఁజేర్చి యున్నారు. అందుచేత వారికి బూర్వమునం దీతఁడేదో గొప్ప గ్రంధమును జేసి యుండవలెను. పదునాల్గవ శతాబ్దాంతమువఱకును నున్న తిక్కన, యెఱ్ఱాప్రెగడ, రంగనాధుcడు, భాస్కరుఁడు, కేతన, మారన, మంచన, జక్కన, విన్నకోట పెద్దన్న, మడికిసింగన్న మొదలైనవారెవ్వరును భీమకవిని బేర్కొనకయుండుట చేత నాతడు పదునాల్గవ శతాబ్దమునకు బూర్వపువాఁడు కాడని యూహింపఁదగి యున్నది. ఈతనిని మొట్టమొదట బేర్కొన్నవాఁడు శ్రీనాథుఁడు. అనంతామాత్యుఁడు తన భోజరాజీయములో నీ క్రింది పద్యమున భాస్కరుని, రంగనాధుని, అమరేశ్వరుని బేర్కొనియు భీమకవి పేరు చెప్పలేదు
ఉ. నన్నయ్య భట్టఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాథుఁచే
రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెఱ్ఱన మంత్రి నాదిగా
జన్న కవీంద్రులన్నవరసస్పుట వాణు లనంగ ధాత్రిలో
నున్న కవీంద్రులం దలఁతు నుల్లమెలర్పఁగ వాగ్విభూతికిన్!
శ్రీనాథుని తరువాత పౌఢకవి మల్లన్న తన రుక్మాంగద చరిత్రము నందు భీమకవి నీక్రింది పద్యమున స్తుతించియున్నాఁడు
ఉ. నన్నయభట్టఁ దిక్కకవి నాచనసోముని భీమనార్యుఁబే
రెన్నికc జిమ్మపూడి యమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్
సన్నుతిచేసి వాక్యసరసత్వము వీనుల కింపుమీఱ న
త్యున్నతిగా నొనర్తు నెఱయోధులు మేలనఁ గావ్య మిమ్ములన్.
ఇందఱుకవుల పొగడ్త కర్హమయిన భీమనచే రచియింపఁబడిన యుద్గ్రంథమేదియోనా కింత వరకుఁ దెలియరాకున్నది. నృసింహపురాణమని యొకరును, శతకంధరరామాయణ మని యొకరును, భీమకవి కృతములని చెప్పిరి కాని యట్టి వైష్ణవ గ్రంథములను వీరశైవుడును శివపుత్రుఁడు నైన భీమకవి రచియించి యుండునని గ్రంథములను జూచి తృప్తినొందు