391
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
కాకపోవుట నిశ్చయము. తరువాత వీరభద్రరావుగారు తమ యాంధ్రుల చరిత్రములో భీమకవినిగూర్చి యిట్లు వ్రాసిరి.
"కవిజనాశ్రయము రచించినది గోకర్జనృపాలుఁడుగాని యితఁడు గాఁడు. భీమకవి నివాసస్థలము గోదావరి మండలములో గోదావరి తీరమున నున్న వేములవాడ యను పుణ్యక్షేత్రము."
ఈ వేములవాడ వీరభద్రరావుగారు చెప్పినట్లు గోదావరీ మండలములోని దైనను గావచ్చును. రామయ్యపంతులుగారు చెప్పినట్టు గోలకొండదేశము లోనిదైనను గావచ్చును గాని కవిజనాశ్రయమును రచించినది వేములవాడ భీమకవి మాత్రము కాడు. కవి నివాసమైన వేములవాడ గోదావరి మండలములోని దనియే నా నమ్మకము. గోలకొండ మండలములోని వేములవాడయే దాక్షారామమని యచ్చటి స్థలపురాణములలో నుండుట భీమకవి యచ్చటివాఁడని నిరూపించుట కయి చేయcబడిన నూతనాద్భుత కల్పనమయి యుండును. కవిజనాశ్రయకాలమును నిర్ణయింపవలె నన్నచో గ్రంధకర్త యైన రేచన్నకాలమునో యతనిగురువైన వాగీంద్ర చూడామణికాలమునో సప్రమాణముగా నిరూపింపవలెను. అంతేకాని భీమకవివని చెప్పఁబడెడు చాటుధారలనుబట్టియా పని సాధ్యము కాదు. ఈ చాటుపద్యములలో నొకదానినిబట్టి పండ్రెండవ శతాబ్దమును, ఇంకొక దానిని బట్టి పదుమూడవ శతాబ్దమును వేఱొకదానినిబట్టి పదునాల్గవ శతాబ్దమును, మఱియొక దానిని బట్టి పదునాఱవ శతాబ్దమును నగుచున్నది • పరస్పర విరుద్ధకాలములను దెలిపెడి యీ చాటువులలో దేనిని నమ్మి కళింగగంగుని కాలమువాఁడనికాని, పోతరాజు కాలమువాఁ డనికాని, సాహిణి మారనికాలమువాఁ డనికాని, బడబానల భట్టారకాదుల యీవలికాలమువాఁడని కాని, నిర్ణయింప వచ్చును? కవికాలమును నిర్ణయింపవలె నన్నచో నున్నయెడల నిర్వివాదముగా కవిదని యొప్పుకొన్న గ్రంథమును బట్టి నిశ్చయింపవలెను. ఏదోమంచి గ్రంథమును జేయక నాలుగు చాటుధారాపద్యముల నల్లినమాత్రముచేత నాతని నెవ్వరును మహాకవినిగా