పుట:Aandhrakavula-charitramu.pdf/417

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

390

వే ము ల వా డ భీ మ క వి

భాస్కరకులవిలసితవార్ధిచంద్ర గోకర్ణీనృపా" యని లేదు. పూర్ణమైన పద్యమిది

          క. వరకృతులకు సంయుక్తా
             క్షరములలో నెద్ది యైనఁ జను వడి యిడఁగా
             గురుబుధజనవరదాయక
             స్మరసన్నిభసుభగమూర్తి మల్లియరేచా.

ఇది రకారప్రాసములో నున్నది; రామకృష్ణకవిగా రుదాహరించినది లకార ప్రాసములో నున్నది. రామకృష్ణకవిగారు నూతనముగాఁ జేసిన యీ సిద్ధాంతమును చదివి 1912 వ సంవత్సరమునఁ బ్రకటింపఁబడిన తమ యాంధ్రులచరిత్రము ద్వితీయభాగములో చిలుకూరి వీరభద్రరావుగారు గోకర్ణునిగూర్చి యిట్లు వ్రాసిరి —

"భీమన సోదరుఁడైన గోకర్ణణుఁడు వాగీంద్రచూడామణి యను జైన సమయాచార్యుని శిష్యుఁడు వర్ధమానపురాధీశ్వరుఁడు. ఇతఁడు భీమకవికిఁ గర్తృత్వ మారోపింపఁబడిన కవిజనాశ్రయ మను ఛందోగ్రంథమును రచించి కల్యాణపురాధీశ్వరుండైన చాళుక్య జగదేక మల్లనకు సేనాపతి యగు రేచభూపాలున కంకితము చేసెను. ఈ రేచనికిఁ గవిజనాశ్రయుఁ డనీయు గోకర్ణనుకు శ్రావకాభరణాంఁడు డనియు బిరుదనామములు గలవు, కవిజనాశ్రయములో నాలుగాశ్వాసములును జైనకావ్యధర్మముల ననుసరించి వాగ్దేవతాస్తుతితోఁ బ్రారంభింపఁబడినవి. వేములవాడ భీమకవి రచించినది నృసింహపురాణముగాని కవిజనాశ్రయము కాదు.

వీరిరువురును గోకర్జుఁడు రచించిన గోకర్ణఛందస్సని వేఱొక ఛందస్సుండఁగా గోకర్ణుఁ డింకొక పేరు పెట్టి యింకొక ఛందస్సును రచించుట యావశ్యకము కా దనియు, రేచన్న భూపాలుఁడు గాక కోమటి యని "వణిగ్వంశచూడామణీ! బంధుచింతామణీ! శిష్టరక్షామణీ ! సుందరీవశ్యవిద్యామణీ! రేచనా! కావ్యసంసూచనా! యని కవిజనాశ్రయములోనే చెప్పఁ ఇడిన దనియు నాలోచింప రైరి. కవిజనాశ్రయము గోకర్ణవిరచితము