389
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
క. వేములవాడను వెలసిన
భీమేశ్వరుకరుణ గల్గు భీమసుకవినేఁ
గోమటిరేచనమీఁదను
నీ మహిఁ గవు లెన్న ఛంద మెలమి రచింతున్
ఈ పద్యము నిటీవలివా రెవ్వరో చేసి కవిజనాశ్రయమునఁ జేర్చి రనుటకు సందేహము లేదు. ఇట్లు కవిజనాశ్రయమును రేచన రచియించెనా ? భీమన రచియించెనా ? యని సందేహపడుచుండcగా నీ నడుమను పులిమీద పుట్ర వచ్చినట్టుగా వీ రిరువురును గారు-కవిజనాశ్రయమును రచించివాcడు గోకర్ణుఁడని యొక కొత్తసిద్ధాంతము వచ్చినది. దీనిని మొట్టమొదట బైలు దేఱఁదీసినవారు శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు. ఈ కవిగారాంధ్రరాజ కవులను శీర్షికతో 1910 వ సంవత్సరపు ఆంధ్రపత్రిక యుగాదిసంచికలో వ్రాసి దానిలో గోకర్ణుని గూర్చి యిట్లు చెప్పియున్నారు.
"ఇతడు (గోకర్జుఁడు) సూర్యవంశపు క్షత్రియుఁడు........ప్రస్తుతము నైజామురాజ్యమున వనపర్తి సంస్థానమునకు సమీపమున శిధిలమయియున్న వర్ధమానపురమున కధీశ్వరుండు. ఇతనితండ్రి భీమన, గురువు వాగీంద్రచూడామణి [1] యను జైనసమయాచార్యుఁడు. ఇతడే భీమకవికిఁ గర్తృత్వ మారోపింపబడిన కవిజనాశ్రయ మను ఛందో గ్రంధమును రచించి జగదేకమల్లునకు సేనాపతియగు రేచభూపున కంకితము చేసెను. ఈ రేచనికిఁ గవిజనాశ్రయుఁ డనియు గోకర్ణునకు శ్రావకాభరణాంకుఁ డనియు బిరుదములు గలవు. దీనిలో నాలుగాశ్వాసములును, జైనకార్య ధర్మముల ననుసరించి వాగ్దేవతాస్తుతితో, బ్రారంభింపఁబడినవి......... వేములవాడ భీమకవి రచించినది నృసింహపురాణము గాని కవిజనాశ్రయము కాదు. సంయుక్తయతిలక్షణమున, "భాస్కరకులవిలసితవార్ధిచంద్ర గోకర్ణనృపా" యనుటయే చాలినంత నిదర్శనము. [2] ఇప్పడు ముద్రింపబడిన కవిజనాశ్రయమునందు సంయుక్తయతిలక్షణమున "స్మరసన్నిభసుభగమూర్తి మల్లియరే చా" అని యున్నది. గాని