Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

385

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

శతాబ్దాదియం దున్న ట్లెంచవలసి యున్నది. ఇతఁడు జ్యోతిషపటలములు వ్రాసెననియు, వానియందిప్పు డున్న వారును, మున్ను చన్నవారును ముందు పుట్టఁబోవువారును నడుగఁబోయెడు సమస్తప్రశ్నల కుత్తరములు గలవనియు కొందఱు చెప్పుదురు. కాని యవి యన్నియు జనులను మోసము చేయుటకయి వంచకులు పన్నిన తంత్రములే కాని మఱి యేవియుఁ గావు.[1] ఈ మహాకవి యొకనాడు తన తల్లి,బ్రాహ్మణులకు నేయి వడ్డించు చుండగా నేతిచెంబుమసి కడుపుమీద నంటుకొన్నప్పుడు 'అమ్మా నీకడుపు మసి యయినది" అని చెప్పచు, కడుపు మసియయ్యేననుట కొడుకు చచ్చెనని యర్ధ మగుటచేత నా మాట తగిలి యా క్షణముననే మృతుడయ్యెనని చెప్పచున్నారు. మణికొందఱు వెనుకఁజెప్పిన "వేయి గజంబులుండ" నను పద్యములో 'దా బోయిన మీనమాసమున బున్నమ పోయిన షష్టినాటికిన్" అను వాక్యము తగిలి విధివశము చేత తల్లిని నీ కడుపు మసి యయ్యేననె నని చెప్పుదురు. ఈయన కవిత్వశైలి తెలియుట కయి కొన్ని పద్యములిం దుదాహరింపఁబడు చున్నవి.

        ఉ. నవ్యవిలాస రమ్యనలినం బని బాలముఖాబ్జసౌరభా
           భివ్యసనంబునం బరగు భృంగకులోత్తమ తద్వియోగతా
           పవ్యధ బ్రాణి నిల్వదు కృపాగుణ మేర్పడఁ బ్రాహ్మణో న హం
           తవ్యఁ యనంగ నొప్పు వచనస్థితి కుంద కెఱుంగ జేయుమా.
                                                           చాటుధార

       చ. బిసరుహ గర్బవ్రాఁతయును విష్ణుని చక్రము వజ్ర వజ్రమున్
           దెసలను రామబాణము యుధిష్టిరు కోపము మౌని శాపమున్
           మసకపుఁబాముకాటును గుమారుని శక్తియు గాలదండమున్
           బశుపతికంటమంటలును బండిత వాక్యము రిత్తవోవునే -
                                                            చాటుధార

       ఉ. మానుగ విశ్రమాక్షరసమంచితమై స్వరమూcదినం డదీ
           యానుగుణాక్షరంబు గొని యైనను జెప్పఁగ నొప్పు నీ క్రియన్

  1. భీమకవీయ ప్రశ్నలక్షణము " కవిజీవితము, లలో పుటలు (22-26) నీయబడినది. ఇది భీమకవి కృతమైనట్లాధారములు లేవు."