384
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
వ్రాయబడినది. భీమకవి రణతిక్కన కాలములోనే యున్న పక్షమున, ఈ వఱకుఁ జేయఁబడిన తిక్కనకాల నిర్ణయమునుబట్టి భీమన పదుమూడవ శతాబ్దమధ్యమునకుఁ బూర్వపు వాఁడనియే యేర్పడును. ఆ ద్వాత్రింశన్మంత్రుల చరిత్రములోని రణతిక్కన తల్లి పేరు మైలమ్మ యనియు పెంపుడు తల్లి పేరు పోలమ్మ యనియు వ్రాయఁబడుటయే కాక "గరళపు ముద్ద" అను పద్యము భీమకవి తిక్కనఖడ్గమును బ్రశంసించుచుఁ జెప్పిన ట్లీ విధముగా నుదాహరింపCబడినది.
చ. గరళపుముద్ద లోహ మవగాభి మహాశనికోట్లు సమ్మెటల్
హరునయనాగ్ని కొల్మియు గాధీపుకోఱయు పట్టుకార్లు ది
క్కరటిశిరంబు దాయి లయనాడు కమ్మరి వైరివీరసం
హరణగుణాభిరాముఁడగు వైులమతిక్కనిఖఢ సృష్టికిన్.
ఇది యెవ్వరినిగూర్చి చెప్పఁబడిన పద్యమో బుద్ధిమంతు లూహించు కొందురుగాక. భీమకవిని గూర్చి నన్నయ చెప్పిన దనెడు
చ. "మతిఁ బ్రభ నీగిఁ బేర్మి సితమానము పెంపున భీమునిన్ బృహ
స్పతి రవి గర్ణు నర్జనుఁ గపర్ది సుయోధను పోల్పఁబూన నా
మతకరిఁ దీక్ష్ణు దుష్కులు నమానుషు భిక్షు ఖలాత్కు నెంచ వా
క్పతిపు శశిన్ గొమరుసామిని మేరువు నబ్ధిబోల్చెదన్."
అను పద్యమును మఱి యెవ్వరిచేతనో యెవ్వరినిగూర్చియో చేయఁబడి నదయి యుండును.
భీమకవి రాఘవపాండవీయమును రచించెనని పెద్దలనుకొనుటయే గాని గ్రంథము పింగళి సూరన్న నాఁటికే నామమాత్రావశేష మయినది. ఇప్పుడీతఁడు చేసిన ఛందస్సు మాత్ర మొకటి వాడుకలో నున్నది, దానికి కవిజనాశ్రయ మని పేరు. ఇతఁడు తన ఛందస్సును రేచన్న యను కోమటి కంకితము చేసి యున్నాడు. రేచన్న యేకాలపువాడో తెలిసినది కాదు. అయినను గవిజనాశ్రయములో దిన్నకోట పెద్దన కృత మయిన కావ్యాలంకారచూడా మణిలోని పద్యము లదాహరింపఁ బడి యుండుటచేత నతఁడు పదునాల్గవ