Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

383

వే ము ల వా డ భీ మ క వి

         శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
             భిక్షాదాన ము చేయూరా సుకవిరాబ్బృందారకశ్రేణికిన్
             దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
             వక్షౌజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్,"

అను పద్యములో నతనికాలమునం దొక తెలుఁగురాయఁ డున్నట్లు చెప్పబడెను. రామవిలాసములో రామరాజపుత్రుఁ డగు మఱియొక తెనుగు రాయఁఁడీ క్రిందిపద్యములో వర్ణింపఁబడినాఁడు

        మ. అచలాధీశ్వరధీరు రేకపలిదుర్గాధ్యక్షు విద్వేషిరా
            ట్పచయోద్వేలబలావలేపతిమిరప్రద్యోతనున్ విక్రమా
            ర్కచరిత్రోత్తమకావ్యనాయకుని వేడ్కం బ్రస్తుతింపదగున్
            సుచరిత్రాఢ్యుని వత్సవాయతెలుఁగున్ క్షోణీశచూడామణిన్.

ఇరుపురును కస్తూరికే ప్రసిద్దు లయినట్టు చెప్పఁబడినను, పదునాల్గవ శతాబ్దాదిని భీమకవికాలములో నుండిన తెలుంగాధీశుఁడును పదునెదవశతాబ్దాదిని శ్రీనాధునికాలములో నూఱు సంవత్సరములకుఁ దరువాత నుండిన తెలుంగాధీశుcడును. ఏకపురుషుడుఁగా గాక వేఱువేఱు పురుషులయి యుండవలెను. ఈ ప్రకారముగానే మైలముభీమన లనేకులుండవచ్చును. ఇది గాక కవి జీవితములోనే రణతిక్కన రణనిహతుఁడయినప్పుడు భీమకవి రణ తిక్కనిభార్యను "దీర్ఘసుమంగళీభవ" యని దీవించి

          క. గుణములనిధాన మగు
             మన రణతిక్కఁడు తాఁ గళేబరంబును శిరమున్
             గణఁక మెయిఁ గలయ బ్రతుకును
             బ్రణుతాఖిల వైరి మకుటభాసితపదుఁడై'.

అను పద్యము చెప్పి మొండెమును శిరస్సును నేకముగాఁ గూర్చి బ్రతికించె నన్నకథ డ్వాత్రింశన్మంత్రులచరిత్రమునుండి గ్రహింపఁబడి, దానినిగూర్చి [1]"యీ కథ కేవలకల్పితమని చెప్పుట కాధారము లేవియుఁ గానరావు" అని

  1. కవిజీవితములు పుట 28