పుట:Aandhrakavula-charitramu.pdf/408

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

381

వే ము ల వా డ భీ మ క వి

నట్టు కవి జీవితములలో వ్రాయcబడియున్నది. [1] ఒకవేళ మైలము భీమన్న యందుఁ జెప్పఁబడిన కాలములోనే యుండినను పై పద్యమువలన వేములవాడ భీమకవి యాతనికాలమునందే యుండినవాc డయినట్టు నిశ్చయముగా జెప్ప వలనుపడదు. మైలమభీమన సంతతివారి కోరికప్రకారమైవను భీమకవి యూ పద్యమును జెప్పి యుండవచ్చును. ఈవఱకిం దుదాహరింపఁబడిన పద్యములే కాక స్వవాదోపబలార్ధముగాఁ గవి జీవితములలో నుదాహరింపఁబడిన యీ క్రిందిపద్యమును భీమకవి మైలముభీమన కాలమని చెప్పఁబడెడు కాలములో నుండె ననుట నబద్ధము చేయుచున్నది

            సీ. గడియలోపలఁ దాడి కడఁగి ముత్తవియఁగాఁ
                                     దిట్టిన మేధావి భట్టుకంటె
                 రెండు గడెల బ్రహ్మాదండిముండ్లన్నియు
                                     డుల్ల దిట్టిన కవిమల్లుకంటె
                 మూడు గడియలకు మొనసి యత్తినగండి
                                     పగలఁ దిట్టిన కవి..నుకంటె
                 నరజాములోపలఁ జెఱువునీళ్ళిం కంగఁ
                                     దిట్టిన బడబాగ్నిభట్టుకంటె

                 నుగ్రకోపి నేను నోపదు శపియింపఁ
                 గ్రమ్మఱింప శక్తి గలదు నాకు
                 వట్టిమ్రానఁ జిగురు పుట్టింప గిట్టింప
                 బిరుద వేములాడభీమకవిని.

ఇందలి "వేములాడ' యన్న ప్రయోగము మాత్రమేకాక, ఈ పద్యము నందు బేర్కొనఁబడిన కవులును. నీ పద్యము భీమన చెప్పినది కాదని ఘోషించుచున్నారు. ఈ పద్యములోఁ బ్రథమపాదమున మేథావి భట్టు తాళవృక్షమును ముత్తునియలుగాఁ దిట్టినట్లు చెప్పఁబడిన పద్య మిది

          క. సాళువ పెదతిమ్మమహీ
             పాలవరుఁడు వీఁడె వచ్చెఁ బద్యము వ్రాయన్

  1. కవిజీవితములు