380
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
నడఁగిపోవు ననియు భీమన తలఁచె ననుట యుక్తివిరహితమైన వెఱ్ఱిమాట యగుట యించుక యాలోచించినవారి కెవ్వరికిని దోcచకపోదు. భారతరాఘవార్ధములు గల ద్వ్యర్థికావ్యమం దొకయర్థము గల భారతమును రచించుటచే నెట్లు నశించును? పై పద్యమునందలి యుత్తరార్ధములోని యుక్తి యీ యుక్తిని సహితము మించి యున్నది ఛందము నడఁచుటకcట! వ్యాకరణ మును సంగ్రహించెనఁట ! "పృష్ణతాడనా ద్దంతభంగ" యన్నట్లు వ్యాకరణము రచించుటచేత ఛందస్సెట్లు నశించును? వ్యాకరణము శబ్దలక్షణము; ఛందస్సు పద్యలక్షణము. ఆంధ్రశబ్దచింతామణి వలన భీమన తన ఛందస్సడుగంటు నని తలచుకొనుట కా యాంధ్రశబ్దచింతామణిలో రెండు శ్లోకములు దక్కఛందోవిషయ మేమియు లేనేలేదు. ఆంధ్రశబ్దచింతామణిని
క. “ఆదిcని భీమకవీంద్రుడు
గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున; నా
మీఁదట రాజనరేంద్ర
క్ష్మాదయితునిపట్టి దాని మహి వెలయించెన్." [పీఠిక -51 ప]
అను తన యద్బుతకల్పన కాధారముగా నుండుటకయు యీ గాధను బుద్దిమంతుఁడైన యప్పకవియే కల్పించి యుండును గాని యాంధ్రశబ్దచింతామణిని నన్నయ రచించియు భీమన చించియు నుండరు. భీమన చాటుధార యని యప్పకవీయములో
చ. 'గరళపుముద్ద లోహ మవగాఢమహాశనికోట్లు సమ్మెటల్
హరునయనాగ్ని కొల్మి యురగాధిపకోఱలు పట్టుకార్లు ది
క్కరటిశిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వై రివీరసం
హరణగుణాభిరాముఁ డగు మైలమభీమనఖడ్గసృష్టికిన్."
అను పద్య మదాహరింపఁబడి యున్నది ఈ మైలముఖీమన శాలివాహన శకము 925 వ సంవత్సరపున నుండె నని యొకచోటను, శాలివాహన శకము 935 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1053 వ సంవత్సరమునం దుండెనని యొకచోటను జెప్పఁబడి, మైలముభీమనకాలములో నుండినవాఁ డయినందున భీమకవి పదునొకండవ శతాబ్దములోని వాఁడయి