పుట:Aandhrakavula-charitramu.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

376

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

క్రింది భీమకవి చాటుధారాపద్యమువలన మారఁడు చొక్క నృపాలుని కాలములోనివాఁ డగుట తేటపడుచున్నది.

    ఉ. చక్కఁదనంబుదీవి యగు సాహిణి మారఁడు మారుకైవడిన్
        బొక్కి బడంగలండు చలము న్బలముంగల యా చళుక్యపుం
        జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కుల మంటలురాలఁజూచినన్
        మిక్కిలి రాజశేఖరునిమీఁదికి చచ్చిన రిత్తవోవునే

ఈ సాహిణిమారcడును, హుళక్కి భాస్కరుడును గణపతిదేవునిమనుమc డై న ప్రతాపరుద్రునికాలములో నుండినట్లు సోమదేవరాజీయమునఁ జెప్పఁబడియున్నది. ప్రతాపరుద్రునికాలములో నున్న సాహిణిమారఁడు పదుమూడవ శతాబ్దాంతమునను పదునాల్గవ శతాబ్దాదియందును నుండవలసి యున్నందున, చొక్కనృపాలుఁడును, భీమకవియుఁ గూడఁ పదునాల్గవ శతాబ్దాదియందుండినవారని నిశ్చయింపవలసియున్నది చొక్కనృపాల, సాహిణి మారుల విషయమున 'ఆంధ్రకవి తరంగిణి"లో క్రింది రీతిని గలదు. '(ఈ చక్కదనంబురీవ) యగు పద్యము వేములవాడ భీమకవి రచించెనని యనుట కప్పకవి వ్రాఁత తప్ప మఱియొక యాధారము లేదు. ఇది భీమకవికృతమని మనము నమ్మితిమేని భీమకవికాలములోనే యిరువురు చొక్కనృపాలురుండుట యసంభవము కావున, నీ పద్యములో జెప్పబడిన చొక్క_నృపాలుఁడును పై పద్యములకు (ఆనీతాభ్యుపదాన-శంభువరప్రసాద అను వానికి) సంబంధించిన చొక్కనృపాలుఁడును, ఒక్కడే యనుటకు సంశయింపనక్కరలేదు. ........... పశ్చిమ చాళుక్యులలోఁగాని, తూర్పు చాళుక్యులలోఁగాని నేనెcఱిగి యున్నంతవరకు చొక్కనృపాల నామధారు లెవ్వరునులేరు. కాని నెల్లూరు మండలములోని గూడూరు తాలూకాలో రెడ్డిపాలెమునకు "శివారు" గా నున్న పాండురంగము నందలి పాండురంగాలయములో నున్న శాసనములలో నొకదానియందు “చొక్క నాయనారని", నామాంతరముగల కులోత్తుంగ చోళుని పేరితో నొక శాసనమున్నది. (నె శా. సం. 446 వ పుట సంఖ్య 96) ఈ శాసనము పూర్తిగాఁ బ్రకటింపబడక పోవుటచే నీ కులోత్తంగ చోళుఁడెవ్వఁడో