పుట:Aandhrakavula-charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

న న్న య భ ట్టు

వరము తనకు రాజధానిగాగా విష్ణవర్ణనుఁడను బిరుదు పేరితోఁ జిరకాలము రాజ్యము చేసెను. ఈ పట్టణమునందలి కోటను కట్టినవాc డితడే. ఇతఁడు విమలాదిత్యుని పుత్రుఁ డయినట్టును చాళుక్యవంశజుఁడయినట్టును భారతము లోవి యీ క్రింది పద్యము చెప్పచున్నది.

    క. విమలాదిత్యతనూజుఁడు,
       విమలవిచారుఁడు కుమారవిద్యాధరుఁడు
       త్తమచాళుక్యుఁడు వివిధా
       గమవిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.

ఈ రాజమహేంద్రుఁడు శివభక్తుఁడును జంద్రవంశ్యుఁడును నయినట్టు కవిని గూర్చి యతఁడు పలికినరీతిగా నాదిపర్వమునఁ జెప్పఁబడిన యీ పద్యముల వలనఁ దెలియవచ్చు చున్నది.

   మ. ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబులై యుండుఁ బా
       యపు భూదేవకులాభితర్పణమహీయ8 ప్రీతియున్ భారత
       శ్రవణాసక్తియుc బార్వతీపతిపదాబ్దధ్యానపూజామహో
       త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్.

   చ. హిమకరుఁదొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్
       క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పినయస్మదీయవం
       శమునఁ బ్రసిద్ధులై విమలసద్గుణశోభితు లైనపాండవో
       త్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్.

ఆపస్తంభసూత్రుఁడును భారద్వాజగోత్రుఁడును నయిన చీదమార్యుఁడను బ్రాహ్మణునకు రాజరాజనరేంద్రుఁడు చంద్రగ్రహణ పుణ్యకాలమునందు గోదావరీ మండలములోని కోరుమిల్లి యగ్రహారము నిచ్చినప్పటి తామ్రదాన శాసనమునుబట్టి చూడఁగా రాజరాజనరేంద్రుఁడు సింహాసనమునకు వచ్చిన కాలము మొదలగునవి తేటపడుచున్నవి. ఆ శాసనమందు రాజరాజనరేంద్రుని పూర్వఁడైన విజయాదిత్యుఁ డయోధ్యానగరమునుండి దక్షిణ దేశము మీఁద