పుట:Aandhrakavula-charitramu.pdf/399

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

372

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రాజ్యమునకు వచ్చెను. ఈతనితల్లి చోడ దేశపురాజు (రాజనరేంద్రుని కొడుకగు కులో త్తుంగచోడ దేవుని ) కూఁతురయినందున, ఇతఁడు చోడ గంగయనియుఁ బిలువఁబడుచు వచ్చెను. నన్నయభట్టునకుఁ దరువాత కళింగ రాజ్య మేలిన 'గంగ' నామము గలవారిలో మొదటివానికాలమునందు భీమన యుండె ననెడు పక్షమున , పయి పద్యమునం దుదాహరింపఁబడిన రాజకళింగగంగితఁడే యనవలసివచ్చును. అప్పు డీతని తండ్రి పేరు రాజరాజగుటచేత, ఆ పేరును సూచించు నిమిత్తమే కళింగ గంగునకుఁ బూర్వము రాజశబ్దము చేర్పఁబడినట్లుసు జెప్పవలసి వచ్చును. ఈ కళింగ గంగు శాలివాహనశకము 1031 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తు శకము 1119 వ సంవత్సరపు నందు తామర శుంఠి యను గ్రామమును మాధవశర్మ యను బ్రాహ్మణు కిచ్చినట్లొక దాన శాసనమునం దున్నది. ఈ శాసనము విశాఖపట్టణమఁ లకరగ్రాహిచేఁ పంపఁబడి చెన్నపురి చిత్ర వస్తు పదర్శనశాలయం దుంచ బడి యున్నది. ఈ కళింగ గంగున కనంత వర్మదేవుఁడని నామాంతరము కలదు. ఈ శాసనములోఁ జెప్పఁబడిన వంశానుక్రమమునుబట్టి కళింగగంగుని తండ్రి రాజరాజు (ఇతఁడే కులోత్తంగ చోడ దేవుని కూఁతు రగు రాజ సుందరిని వివాహ మాడినవాఁడు) రాజరాజు తండ్రి ; ఇతఁడు ముప్పదినంవత్సరములు రాజ్యపాలనము చేసెను. వజ్రహస్తునితండ్రి కామార్ణవుఁడు; ఇతడు తన యన్నలలో నొకడు రెండు సంవత్సరములును, ఒకఁడు మూడు సంవత్సరములును ప్రభుత్వము చేసినతరువాత పందొమ్మిది సంవత్సరములు రాజ్యపాలన చేసెను. కామార్ణవుని తండ్రి వజ్రహస్తుడు; ఇతఁడు ముప్పదియైదు సంవత్సరములు రాజ్యమేలెను. వజ్రహస్తునితండ్రి కామార్ణవుఁడు; ఇతఁడు తన యన్నలును, అన్నకొడుకు ముప్పదియేడేండ్ల రాజ్యము చేసిన తరువాత రాజయి యిరువదియైదు సంవత్సరములు ప్రజాపాలనము చేసెను. కామార్ణవుని తండ్రి గుణార్ణవుడు; ఇఁత డిరువదియేడు సంవత్సరములు భూమియేలెను. గుణార్ణవునితండ్రి కామార్ణవుఁడు. ఇతడన్నయైన వజ్రహస్తుడు 15 సంవత్సరములు దేశ మేలినతరువాత ప్రభుత్వమువకు వచ్చి పందొమ్మిదేండ్లు నేల యేలెను.కామార్ణవుని తండ్రి ( ? ) రణార్డవుఁడు;