పుట:Aandhrakavula-charitramu.pdf/398

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

371

వే ము ల వా డ భీ మ క వి

యడుగఁగా "నేను వేములవాడభీమకవి చేసిన జోగి " నని యాతఁడు ప్రత్యుత్తరము చెప్పెను, అందుమీఁద కవి కరుణించి

       ఉ. 'వేయి గజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో
            రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకో వడిన్
            రాయకళింగ గంగ కవిరాజు భయంకర మూర్తి చూడఁ దాఁ
            బోయిన మీనమాసమునఁ బున్నమ బోయిన షష్ఠినాఁటికిన్.'

అను పద్యమును మరలఁ జెప్పి యాశీర్వదించెను. ఈ యాశీర్వచన ప్రభావముచేత నాతఁడు భాగవతులలోఁ గలసి సజ్జనగరమునకుఁ బోయి. అక్కడి రాజు తన శత్రువు నవమానించుటకయి "రాజకళింగ గంగు వేషము వేసెదరా ?" యని భాగవతుల నడుగఁగ, వారి నొప్పుకొండని చెప్పి రాత్రి వేళ తానా వేషము వేసికొని, వేషమునిమిత్తమని తనఖడ్గమును, గుఱ్ఱమును రాజువలనఁ బడసి యశ్వారోహణము చేసి యాటనెపమున నిజముగా రాజకళింగ గంగే వచ్చెనని జను లాశ్చర్యపడ రాజును సమీపించి తన చేతిఖడ్గధారతో నాతని శిరస్సు ఖండించి తానా సింహాసన మెక్కి కూరుచుండెను. ఈ వార్తయే నిశ్చయ మయి యా రాజు చాళుక్యరాజులు రాజ్య పదభ్రష్టులైన కాలపువాఁడే యైన పక్షమున, విమలాదిత్యుC డేడు సంవత్సరములును, విమలాదిత్యునిజ్యేష్టభ్రాత యైన శక్తివర్మ పండ్రెండు సంవత్సరములును మరల స్వరాజ్యమును గెలుచుకొన్న తరువాత పాలనము చేసినందున భీమకవి రాజనరేంద్రుని రాజ్యకాలారంభమునందును, తత్పూర్వ మిరువది ముప్పది సంవత్సరముల వఱకును, ఉండినట్లెంచవలసి వచ్చును. అయినను, ఆ కాలమునందు కళింగదేశము నేలిన ప్రభువులలో గంగను పేరు గలవాఁ డెవ్వఁడు నున్నట్లు కనబడఁడు. కాబట్టి భీమకవి నన్నయభట్టునకుఁ బూర్వుఁడు కాఁడనుట నిశ్చయము.

ఎనిమిదవ శతాబ్దారంభము మొదలుకొని పండ్రెండవ శతాబ్దారంభము వఱకును పాలకులుగా నున్న కళింగరాజులలో 'గంగ' నామము గలవాడొక్కఁడు మాత్రమే కనఁబడుచున్నాఁడు. అతఁడు శాలివాహనశకము 999 వ సంవత్సరమునం దనఁగా క్రీస్తు శకము గిది 1077 వ సంవత్సరమున