పుట:Aandhrakavula-charitramu.pdf/385

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

358

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

            మాటలును గీరభాషలు మక్కళించి
            చిగురుఁబోఁడులు వస కేళి చేయఁ జేయ.

వ. వారిలో నొకర్తు.

        మ. సహకారాధిపు గౌఁగిలించుకొని వాసంతీలతాకాంత సా
            రహరిద్రారసగౌరకేసరములన్ రంజిల్లు మాధ్వీకవా
            ర్ల హరి స్వేదముఁ జూపఁ బట్టపగ లేలా యింతటన్ సిగ్గు లే
            దహహా! యంచు దొలంగి నవ్వెఁ జెలిమాటై ముద్దరా లయ్యెడన్

        మ. ఒక రామాతిలకంబు రత్నరుచితో నొప్పారు మందారకో
            రకముం గర్ణవతంసత న్నిలుపుచున్ రాఁగా లతాసక్తచూ
            చుకచేలాంచలమై మలగి విడు మంచున్ గేలు సాcచెన్ - ససా
            యకమౌర్విం దెగఁగొన్న మన్మథుని ప్రత్యాలీఢపాదంబులన్.

        చ. ఒక చపలాక్షి లేఁజిగురుటూయెలఁ గోయిలరాచవారి ని
            క్కకు నెలయింపవచ్చు కలకంఠికటాక్షము ఱెక్కదారు స్రు
            కక్క పలుమాఱుఁ జూపఁ జెలికత్తెలు ముద్దులబావ పొమ్మనన్
            మొకము సగంబు వాల్చె మణిముద్రికలం జిఱునవ్వు గప్పుచున్

        చ. లలన లతావితానముల లత్తకఱేకుల చాయ చల్లచే
            తుల నెలగొమ్మ లందికొనిఁ దోరపునవ్వులు పిక్కటిల్ల నె
            చ్చెలులు చెలంగి మావిరులు చెందొవ లయ్యె ననం దడంబడన్
            దలిరులఁ గోయు రాచిలుకదాఁటులుఁ దేఁటులు నాసచేయఁగన్.

    సీ. సుడిగొన్నచిగురాకుజొ పంబు గెంపారఁ 
               దలమీఁద మల్లికాదామ మడఁచి
     నిడదతామరతూఁడు నెట్టెంబు చుట్టి పైఁ 
               బటికంపుఁ గడియంపుభాగ మదిమి
     తోన యాక్రేవఁ గెందొవఱేకు హత్తించి
               మెడచక్కిఁ గస్తూరి మెదిచి పూసి