పుట:Aandhrakavula-charitramu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

was no Tarana. Hence Sadharana, Saka 1292 expired has been conjecturally taken." షిమోగా మండల (TL No. 154, Shimoga Dt. Ep. Carn ) టీ యల్ 154 వ సంఖ్యశాసనములో బుక్కదేవరాయలు శకవత్సరము 1268 వ్యయ సంవత్సర మార్గశీర్ష శుద్ధ ద్వితీయనాఁడు సింహాసనమెక్కినట్టు చెప్పఁ బడియుండుటచేత క్రీస్తుశకము 1346 వ సంవత్సరాంతమునుండియే యాతని పరిపాలన మారంభమయ్యెనని కొందఱు చెప్పుచున్నారు. అట్లయినను తారణసంవత్సరము కాని శకవర్షము 1216 గాని యీతని రాజ్యకాలములో రావు. ఇఁక "రసాభ్రనయ నేందుభిః" అన్న రెండవ పాఠమును జూడుఁడు. ఇందుఁ జెప్పఁబడిన తారణసంవత్సరమును హరిహర బుక్కరాయలకాలములోనికిఁ దెప్పించుటకు శకవర్షమును 1268 నకు మార్పవలెను. అట్ల మార్చుటచే "రస్నాభ్ర' యని యున్నదానిని "రసర్తు"నుగా సవరించిరి. అట్లుచేసినను బుక్కరాయలకాలములోనికి రాక తారణసంవత్సరము హరిహరరాయలరాజ్యకాలములోనికి వచ్చినది. అందుచేత శాసన కాలము 1344 అనుటకంటె 1370 ఆనుటయే సత్యమునకు సమీపమయి యుండును. శకవర్షము 1298 (క్రీస్తు, శ. 1376) నలసంవత్సర ఫాల్గణ బహుళపాడ్యమి భానువారమునాడు బుక్కరాయలు మృతినొందెను. బుక్కరాయనికాలములో నుండి యాతనిచే నగ్రహారమును బడసి నాచన సోమనాధుఁ డెఱ్ఱాప్రెగడకంటె బూర్వుఁ డని చేసెడి వాదము విశ్వాసార్హమందినది కాదు.

[శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సోముని ఉత్తర'హరివంశపీఠికలో శాసనమునందలి 'రసాభ్రనయనేందుభిః' అనుదానిలోని "భ్ర" ను "రు" గా సవరించి, శాసనకాలము శా. శ.1266 గా నిర్ణయించిరి. నాగరలిపిలో 'భ్ర, ర్తు’ లకు ఎక్కువ పోలికయుండుటచే శాసనమును వ్రాసినవారుగాని పఠితలుగాని పొరపాటుపడియుందురని శ్రీ శాస్త్రులుగారి యాశయము. కాఁగా నీతc డెఱ్ఱాప్రెగడకు సమకాలికుఁడో, కొంచెము తర్వాతివాఁడో అయియుండును. ఆంధ్రకవితరంగిణియందు నీ యాశయమే తెలుపcబడినది.]