పుట:Aandhrakavula-charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

11

న న్న య భ ట్టు

          ఆ. నిత్యసత్యవచను మత్యమరాధిపా
              చార్యు సుజను నన్నపార్యుఁ జూచి
              పరమధర్మవిదుఁడు వరచళుక్యాన్వయా
              భరణుఁ డిట్టులనియెc గరుణతోడ.

ఈ భారతమును దెనిఁగించుటలోఁ దనకు నారాయణభట్టు*[1] సహాయుఁడుగా నున్నట్లు కవియే చెప్పుకొనుచున్నాడు. నన్నయ వేఁగి దేశమునకు రాజయిన రాజనరేంద్రుని యాస్థానపండితుఁడు. పూర్వ మాంద్రదేశమునకుఁ గొంతకాలము వేఁగిదేశ మని వ్యవహారము కలచు. నిజమైన వేఁగి దేశము

  1. *

           ఉ. పాయక పాలక శాసనిక్షి భారతఘోరరణంబునందు నా రాయణునట్టు, తానును ధరామరవంశ విభూషణుండు నా రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడుం దవకిష్టుడు న్సహా ధ్యాయుcడు నైన వాc డభిమతంబుగఁ దోడయి నిర్వహింపఁగన్" |ఆది పర్వము|

    ఈ పద్యము యొక్క రెండవ పాదమున 'తానును ధరామరవంశ విభూషణుండు' అనునెడ 'తానును' కు బదులుగా 'వానస' అను పాఠమున్నది దానినే పలుపురంగీకరించి యున్నారు. 'వానస' వంశమున హరితసగోత్రులు, కాస్యప గోత్రులు, వసిష్ట గోత్రులు గలరు. నారాయణభట్టు హరితసగోత్రుఁడు. కావున 'వానస' అనునది గ్రామ నామము గాని పౌరుష నామము "గాని యయి యుండవచ్చునని కొందఱి మతము. ఈ పద్యము పెక్కు_ భారత ప్రతులయందుఁ గన్నట్టుట లేదనియు, అప్పకవి మాత్రము దీని నుదాహరణముగా గ్రహించెను గాని, తత్పూర్వము వ్రాయcబడిన భారత ప్రతులు లభించనందున, ఏ సంగతిని ఇదమిత్థమ్మని నిశ్చయింపవలనుపడదనియుఁ శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు భారతరచన లో నారాయణభట్టు నన్నయకు సాయపడెనన విషయమును సందేహించుచున్నారు కాని నారాయణభట్టు నన్నయ సమకాలికుఁడని మాత్ర మంగీకరించుచు ఈ పద్య విషయమెట్లున్నను నారాయణభట్టు నన్నయ సమకాలికుఁడగుటకు నందమపూఁడి శాసనవేు ప్రమాణము అని వ్రాయుచున్నారు. [చూ, తెనుఁగుకవుల చరిత్ర పుటలు 158, 159. నారాయణభట్టు భారతరచనమున నన్నయభట్టుకు సాయపడెనని శ్రీ కావలి వేంకటరామస్వామి గారు (Biographical Sketches of Dekkan Poets గ్రంథకర్త), 'కవి జీవితము' లను రచించిన శ్రీ గురజాడ శ్రీరానుమూర్నిగాగు, *ఆంధ్రకవి తరంగిణి" ని రచించిన శ్రీ చాగంటి శేషయ్యగారు మున్నగు వారభిప్రాయపడుచున్నారు.]