ఈ పుట ఆమోదించబడ్డది
345
హు ళ క్కి భా స్క రు డు
ఇందలి యయోధ్యాకాండమును రచించిన కుమారరుద్రదేవుని గ్రంథాంతరములు కానరాలేదు. ఈతఁ డోరుగంటిని పాలించిన రుద్రదేవుని బంధువై యుండునని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారును, కృతిపతి యగు సాహిణిమారన పుత్రుఁడని (శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారును భావించిరనియు, వారియూహలు సరికావనియు "ఆంధ్రకవి తరంగిణి"లోఁ గలదు. (మూడవ సంపుటము-" కుమారరుద్రదేపుఁడు") ఇతఁడు 13 వ శతాబ్దిచివఱను, 14 వ శతాబ్ది తొలిపాదమునను ఉండియుండును.
యుద్ధకాండమును పూరించిన (శాకల్య) అయ్యలార్యుఁడు మల్లాభట్టు మనుమఁడు; అప్పలార్యుని నందనుఁడు; ఇతడు రామాయణ యుద్ధకాండమును క్రీ.శ.13౩౦ ప్రాంతమున పూర్తిచేసియుండునని 'ఆంధ్రకవి తరంగిణి' (నాలుగవసంపుటము-పుట 154) లోఁ గలదు.]