పుట:Aandhrakavula-charitramu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

"యుద్ధకాండంబునందు సర్వంబును షష్ణా శ్వాసము" అని యున్నది. దీనిని బట్టి చూడఁగా భాస్కరుడే యుద్ధకాండంబునంతను రచించి, దాని నారణ్యకాండమును వలెనే యా శ్వాసములుగా భాగించి యుండునని తోఁచుచున్నది. అయినను యుద్ధకాండము కడపట షష్ఠాశ్వాసమని యుండుటయే కాని లోపల నాశ్వాస విభజనము కానరాదు. దీనినంతను విచారించి చూడఁగా రామాయణ మంతయు భాస్కరునికాలములోను సాహిణిమారనకాలము లోను రచింపఁబడినదే యని విస్పష్ణ మగుచున్నది. రామాయణ కవిత్వ మంతటిలోను మొట్టమొదట నారణ్యకాండకవిత్వమును, దానికిఁ దరువాత యుద్ధకాండకవిత్వమును మేలయినదిగాc గానఁబడుచున్నది.

భాస్కరరామాయణమునందలి బాల, అరణ్య, కిష్కింధాసుందరకాండములను మంత్రి భాస్కరుఁడును, అయోధ్యాకాండమును కుమారరుద్ర దేవుఁడును, యుద్ధకాండములోని కొంతభాగమును హుళక్కిభాస్కరుఁడును, మిగిలిన భాగము నయ్యలార్యుఁడును రచించిరనియు, బాల, కిష్కింధా, సుందరకాండములలో మల్లికార్డున భట్టు కవిత కొంత చేరియుండుటవలన కాండముల చివరికి గద్యము లాతని పేరిటనే కానవచ్చుచున్నవనియు "ఆంధ్రకవి తరంగిణి" కారుల యభిప్రాయము. బాలకాండము, అయోధ్యా కాండము, ఆరణ్యకాండమును మంత్రి భాస్కర విరచితములయి యుండునని "తెనుగుకవుల చరిత్ర" కర్తల యభిప్రాయము. భాస్కరరామాయణములోని బాల, కిష్కింధా, సుందరకాండములను భాస్కరుని కుమారుఁడగు మల్లికార్జునభట్టు రచించినట్లు గద్యములవలన దెలియవచ్చుచున్నది. ఆ కాండములలో నీతని కవిత కొంత చేరియం డును. ఇతcడు హుళక్కిభాస్కరుని పుత్రుఁడు ఇతఁడు తన గ్రంధభాగములను పరమేశ్వరాంకితములుగా నొనర్చెను. ఇతని యితర గ్రంథము లేవియు లభింపలేదు. హుళక్కిభాన్కరుని కాలము పదుమూఁడవ శతాబ్ది ద్వితీయ పాదమునుండి పదునాల్గవ శతాబ్ది ప్రథమపాదము వఱకు నగుటచే మల్లికార్జునభట్టు క్రీ.శ.1280-13౩౦ నడుమనుండి యుండునని 'ఆంధ్రకవి తరంగిణి' కారుల యభిప్రాయము, (మూcడవ సంపుటము పుట 218)