343
హు ళ క్కి భా స్క రు డు
భ్రంకష శాతకుంభశిఖరంబగు వెూసలఁ గంటి రెట్లు నా
వంకఁ జరింప దగ్ని యవి వారివిభీషణుపుణ్యగేహముల్"
[యుద్ద 1133 ]
ఇక్కడనుండి యయ్యలార్యుని కవిత్వము. " ఇకమీఁద శాకల్యమల్లభట్టు చెప్పిన కవిత్వము" అని కొన్ని వ్రాఁతప్రతులలోను, 'ఈ మీఁద వేదగిరి రాయనింగారు శాకల్యమల్లుభట్టుగారి మనుమcడు అయ్యలుభట్టుగారిచేత చెప్పించిన యుద్ధకాండ శేషము" అని కొన్ని వ్రాఁత ప్రతులలోను ఉన్నది. యుద్ధకాండాంతపద్యము కొన్ని ప్రతులలో
"అష్టభాషాకవిమిత్రకులపవిత్ర భాస్కరసత్కవిమిత్రాయ్యలార్య విరచితంబైన........"
అనియు, కొన్నిప్రతులలో
"ఇది శ్రీశాకల్యమల్లకవివర రామనరసింహావరజాప్ప లార్యవరనందనోభయభాషాకవితావి శారద శారదాచరణకమల పరిచరణ మానసాయ్యలార్య విరచితంబై_న......."
అనియు నున్నది. ఇందలి మొదటి గద్యములో నయ్యలార్యుఁడు భాస్కరుని మిత్రుఁ డనియు, రెండవ గద్యములో శాకల్యమల్లనియెుక్కయు.రామనృసింహుని యొక్కయు తమ్ముడైన యప్పలార్యుని పుత్రుడనియు చెప్పఁబడెను. అయ్యలార్యుఁడెట్లయినను భాస్కరకవికి సమకాలీనుఁడే. ప్రతాపరుద్రునియాస్థానములో శాకల్యమల్లభట్టు పండితుఁడు గాను, భాస్కరుఁడు కవిగాను, ఉండినందున శాకల్యమల్లకవి తమ్మునికొడుకైన యయ్యలార్యుఁడు మల్లికార్జునభట్టు, కుమారరుద్రదేవులతోడి యీడువాఁడయి యుండును. కవి చెప్పినదానికి ప్రత్యక్షవిరోధముగా నెవ్వడో లేఖకుఁ డెవ్వడో వేదగిరిరాయనింగారు చెప్పించిరని వ్రాసిన మాట పాటింపఁదగినది కాదు. 150 వ సంఖ్యగల వ్రాఁతప్రతిలో గద్య యయ్యరుల్యానిదే యున్నను, "శ్రీమద్రామాయణమహాకావ్యంబున యుద్ధకాండ శేషంబునందు సర్వంబును షష్ణా శ్వాసము" అని యున్నది. 155-వ సంఖ్య గల వ్రాఁతప్రతియందు గద్య సహితము భాస్కరునిదే యుండి