330
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
చ. అనఘు హుళక్కిభాస్కరు మహామతిఁ బిల్లలమఱ్ఱి పెద్దిరా
జును బినవీరరాజుఁ గవిసోమునిఁ దిక్కనసోమయాజిఁ గే
తనకవి రంగనాధు నుచితజ్ఞుని నెఱ్ఱన నాచిరాజుసో
మన నమరేశ్వరుం దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్."
భాస్కరరామాయణ మంకితము చేయఁబడిన సాహిణిమారఁడు బుద్ధరాజు కొమారుఁ డయిన ట్లయోధ్యాకాండములోని యీ క్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.
క. 'శ్రీరమణీరమణసుధా
ధారాళదయాకటాక్షదామస్మితదృ
క్కైరవ వితరణకరణవి
శారద బుద్ధయకుమార ! సాహీణిమారా ! [ అయోఁ 1 ]
ఈ బుద్ధరాజునకు నవనాధుఁ డనియు పేరు గలదు. రంగనాథరామాయణము బుద్ధరాజు రచియించిన ట్లుండుటచేతను, భాస్కరరామాయణ మా రాజపుత్రుఁ డయిన మారని కంకితము చేయఁబడుటచేతను సాహిణి మారఁడా బుద్ధరాజు కొడుకే యైనపక్షమున రంగనాధరామాయణము భాస్కరరామా యణమకంటె నిరువది, ముప్పది సంవత్సరములు ముందుగా రచియింపఁబడినదని చెప్పవలసి యుండును. సాహీణి మారఁడు గుఱ్ఱపువాఁడని చెప్పెడి కథ కేవలకల్పితము. అతఁడు రాజపుత్రుఁడు. అతఁడు క్షత్రియ కులజుడు కాక రెడ్డివంశపువాఁ డయినను, రాజ్యభారమును వహించిన వాcడగుటచే రా జయ్యెను. తండ్రిజీవితకాలములో సేనాధిపతిగా నుండి, తరువాత రాజయ్యెను, ఈతనిది సాహిణివంశము. ఇతని కుమారుఁడు కుమారరుద్ర దేవుఁడు. ఇతఁడే రామాయణమందలి యయోధ్యాకాండమును తెనిఁగించిన కవి. అందుచేతనే గద్యమునం దీతఁడు "మారయకుమార కుమారరుద్ర దేవ ప్రణీతం" బని వ్రాసికొన్నాఁడు. కోనకాటభూపతి కుమారుఁడు రుద్రరాజు, రుద్రరాజుకుమారుఁడు బుద్దరాజు; బుద్ధరాజు కుమారుఁడు విట్టలరాజు, విట్టలరాజకుమారుఁడు బుద్ధరాజు, మారయ సాహిణి బుద్ధరాజు కుమారుఁడే యయినను, రంగనాథరామాయణకృతికర్త