329
హు ళ క్కి భా స్క రు డు
పదునేనవ శతాబ్దాంతమునుండి కవు లొక్కభాస్కరునే పూర్వకవినిగా స్తుతించుచుండుటచేతను, కవిత్వము నకుఁ బ్రసిద్ధికెక్కిన భాస్కరుఁ డొక్కఁడే యనియు, కొందఱు భాస్కర శబ్దమునకు హుళక్కిపదమును గూడఁ జేర్చుచు వచ్చుటచేత నాతఁడు హుళక్కి భాస్కరుఁడే యనియు, ఊహింపఁదగి యున్నది. అదియే నిజమైనచో భాస్కరరామాయణము పదునాల్గవ శతాబ్దాదిని రచియింపఁబడెనని చెప్పవలసి యుండును.
చ. సహజకళంకమూర్తులు కుజాతులు గూఢతరోదయ ప్రభా
మహిములు గోత్రవిద్విషదమాత్యులు రాత్రి చరానుకూలధీ
సహితులు మందవర్తనులు సర్పసమానులు రాజసేవక
గ్రహములు గాననయ్యె నల రాయని భాస్కరుఁడస్తమించినన్.
శా. రెండా నాల్కలు, సంప్రదాయకునకున్ లెక్కింపఁగా నొక్కటే
గండా మొండి శిఖండిబండలకు లెక్కల్లేనినాల్కల్గదా!
చండారాతికులాటవీదహనచంచజ్జైత్రయాత్రాలస
త్కాండా ! రాయని మంత్రిభాస్కరునికొండా ! దండనాధాగ్రణీ !
శా. కాండావిర్భవభాండభూపరివృఢగ్రైవేయశైలేయ సూ
కాండాటాధిపకేతుమాతులబలాకాశస్రవంతీమరు
త్కాండాఖండలతుండిపాండురయశఃకర్పూర పేటీభవ
త్కాండా! రాయనిమంత్రిభాస్కరునికొండా ! దండనాధాగ్రణీ.
వెనుకటికూర్పులం దుదాహరింపఁబడిన పయి పద్యములు మంత్రిభాస్కరుని గూర్చినవియు, గొమ్మనామాత్యునిగూర్చినవియుఁ గాక రాయని భాస్కరుని గూర్చినవియు, నాతని పుత్రుఁడై న కొండామాత్యునిగూర్చినవియు నయి యున్నవి. మంత్రిభాస్కరుడాఱు వేల నియోగి. హుళక్కి భాస్కరుఁడు కొడుకైన మల్లికార్జునభట్టు, భట్ట నామము కలవాఁడగుటనుబట్టి వైదిక బ్రాహ్మణుడని యూహింపఁదగి యున్నది కాని విక్రమార్కచరిత్రము రచించిన యాఱువేలనియోగి యైన కోవెల గోపరాజు హుళక్కి భాస్కరుని గూడఁ దనకులమువారైన నియోగి కవులలోనే చేర్చియున్నాఁడు చూడుఁడు.