పుట:Aandhrakavula-charitramu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

  శా. "పుణ్యుం డూర్జితశౌర్యధైర్యమహిమస్పూర్తిస్ఫురద్వైభవా
        గణ్యుం డార్యజనానురంజితమహాకారుణ్యుఁడున్ శ్లాఘ్యసౌ
        గుణ్యుం డన్వయవార్ధిచంద్రుఁడు రిపుక్షోణీశ్వరస్థాపితా
        రణ్యుం డార్త శరణ్యుఁ డుజ్జ్వలఁ యశోరమ్యుండు సౌమ్యుండిలన్
                                          [అరణ్య. ఆ.1-291 ]
అనియు
   
   శా. వైరిక్ష్మాతలనాధపర్వతమహావజ్రాయుధున్ ఘోరదు
       ర్వారాఁహః ప్రథితారిదుస్సహతమిస్రప్రస్ఫురద్భానుగం
       భీరాంభోనిధి ధీరతానిమిషభూభృన్నాధు నత్యంతవి
       స్తారోదారగుణప్రసిద్ధినవరాధాపుత్రు సన్మిత్రునిన్."
                                          [అరణ్య. ఆ.2-433 ]

అనియు. వరుసగాఁ బ్రథమ,ద్వితీయాంతములుగా నుcడుటచేతను దిక్కనకవి కృతమయిన నిర్వచనోత్తరరామాయణమునందలి యాశ్వాసాంతపద్యములుకూడ నీ విధముగానే వివిధ విభక్త్యంతములుగా నుండుటచేతను వన కాండమును భాస్కరమంత్రి రచించెననియు, బితామహునియందలి గౌరవముచేతఁ దిక్కనయుఁ దన యాశ్వాసాంత పద్యముల నాతఁడు చూపిన దారినే రచియించెననియు నూహించుచున్నారు. ఎంత సయుక్తికముగానున్నను, ఇవి యూహలేకాని సిద్ధాంతములు కానేరవు. అరణ్యకాండము సాహిణిమారని కంకిత మొనర్చుట యీ యూహలను బాధించుచున్నది. పండ్రెండవ శతాబ్దమునందుcడిన మంత్రిభాస్కరుఁడు పదుమూడవ శతాబ్దాంతమునను, పదునాల్గవ శతాబ్దాదియందును ప్రజాపాలనము చేసిన ప్రతాపరుద్రునికాలములో సాహిణిమారని కంకితము చేసె ననుట పొసగియుండనేరదు. కాబట్టి యారణ్యకాండమునుగూడ హుళక్కి భాస్కరుఁడే రచియించియుండును. తిక్కనసోమయాజిని గాని యూతనివంశమును వర్ణించిన కేతనకవి గాని భాస్కరమంత్రి రామాయణమును రచించెనని చెప్పి యుండకపోవుటచేతను, పదునాల్గవ శతాబ్దాంతమువఱకు నుండిన కవులెవరును భాస్కరుని పూర్వకవినిగా స్తుతించియుండకపోవుటచేతను,