పుట:Aandhrakavula-charitramu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

319

చిమ్మపూఁడి అమరేశ్వరుఁడు

బడినది. ఆ పుస్తకమును సంపాదించుటకయి నేను బహలేఖలను వ్రాసితిని గాని నేను త్వరపడిన కొలఁదిని పుస్తకప్రకటన మాలస్యము కాఁజొచ్చెను. అందుచేత నేను ముద్రితప్రతిని శీఘ్రముగాఁ బొందఁగాంతు నన్నయాశను విడిచిపెట్టి నా కవిచరిత్రమున కనుకూలముగా నుండుట కయి విక్రమసేనము యెుక్కయవతారికను గ్రంథములోని కొన్ని పద్యములను వ్రాసి పంపవలసిన దని కవిగారిని వేఁడితిని. కవిగారు తమయొద్ద నున్న పుస్తకములో నవతారికభాగము లేదనియుఁ గొన్ని పద్యములను వ్రాసి పంపెద మనియు నాకుఁ బ్రత్యుత్తర మిచ్చిరి. శ్రీరామకృష్ణకవిగారీ సంవత్సరము మెయి నెల 10 వ తేదిని చెన్నపురిలో "అపూర్వ వాఙ్మయ పరిశోధనము" ను గూర్చి యొనర్చిన యపన్యాసములో జగ్గన్న ప్రబంధ రత్నాకరములో నుదాహరింపఁబడిన గ్రంధముల బేర్కొనుచు వానిలో విక్రమసేన మొకటిగాఁ జెప్పి, వానిలోఁ గొన్నిటిలోఁ గొన్నిభాగములు మాత్రమే తమకు లభించిన వని చెప్పుటచేత విక్రమ సేనముయొక్క యవతారిక మాత్రమే కాక గ్రంథమంతయు వారికి లభింపలేదనియుc, బ్రబంధ రత్నాకరములో నుదాహరింపఁబడిన పద్యములు మాత్రమే వారికి లభించి యుండుననియు నే నూహించుచున్నాను. నా యూహ సత్యము కాకపోవచ్చును. గ్రంథావతారిక గాక తక్కిన పుస్తకభాగ మంతయు వారియొద్ద నుండినపక్షమునఁ జిరకాలమిత్రులయిన కవిగారు నా ప్రార్ధనము చెల్లింపకుండి యుండరు. విక్రమ సేనములోని పద్యములు ముప్పదికంటె నెక్కువగా నాంద్రసాహిత్యపరిషద్గ్రంథాలయమువారి యుదాహరణపుస్తకములో నియ్యబడినవి. ఆం దుదాహరింపఁబడిన పద్యములను గొన్నిటి నిందు క్రిందఁ బొందుపఱుచు చున్నాను.

            సీ. సారధి శతవృద్దు చక్రంబు లొనఁగూడి
                        జరగవు రథమున సంఘటించి
               యుదకంబు సోఁకున కోర్వనియరదంబు
                        చేతికి బిరుసైన రాతివిల్లు