వి న్న కో ట - పె ద్ద న్న
విన్నకోట పెద్దన్న యనెడి కవి కావ్యాలంకారచూడామణి యను లక్షణ గ్రంథమును రచియిం చీనవాఁడు. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు; గోవిందరాజపుత్రుఁడు; కౌశిక గోత్రుఁడు. ఈతని వాసస్థానము రాజమహేంద్రవరము. కావ్యాలంకారచూడామణిలో నితఁడు పురవర్ణనమున కుదాహరణముగా రాజమహేంద్రవరము నిట్లు వర్ణించియున్నాఁడు.
సీ. గంభీరపరిఘ నాగస్త్రీల కశ్రాంత
కేళీ విహారదీర్ఘిక యనంగ
నుత్తాలసాల మన్యుల కుబ్బి దివిఁ బ్రాఁకఁ
జేసినదీర్ఘ నిశ్రేణి యనఁగఁ
జతురచాతుర్వర్థ్యసంఘ మర్థులపాలి
రాజితకల్పకారామ మనఁగఁ
భ్రాంతసుస్థిత యైనభవజూటవాహిని
భుక్తిముక్తి ప్రదస్పూర్తి యనఁగ
నెప్పుడును నొప్పురాజమహేంద్రవరము
ధరణిఁ గల్పించె నేరాజు తనదుపేర
నట్టిరాజమహేంద్రునియనుఁగుమనుమc
డెసఁగు జాళుక్యవిశ్వనరేశ్వరుండు.
[రాజమహేంద్రవరము నీకవి వర్ణించుటం బట్టి యీతని నివాసము రాజ మహేంద్రవరమనియు, విశ్వేశ్వరుఁడు రాజమహేంద్ర పురాధీశ్వరుఁ డనియు తోఁచవచ్చును. విశ్వేశ్వరుఁడు చాళుక్య వంశీయుఁడుగాని రాజమహేంద్రుని పౌత్రుఁడుగాని కాడు.]
ఇతడు తాను రచియించిన యలంకారశాస్త్రమును రాజమహేంద్ర పురాధీశ్వరుఁడును చళుక్యవంశసంభవుఁడును నయిన విశ్వేశ్వరమహారాజున కంకితము చేసెను. విశ్వేశ్వరుని కాలమును సరిగా నిర్ణయించుట కాధారము దొరక