పుట:Aandhrakavula-charitramu.pdf/335

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

308

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         ఉ. "కావునc దత్పురాణము ప్రకాశితసార కథామృతం బొగిన్
             ద్రావి జగజ్జనంబు లలరన్ రచియింపు తెనుంగున న్వచ
             శ్శ్రీవిభవంబుపెంపు విలసిల్లఁగఁ గోవిదు లిచ్చ మెచ్చి సం
             భావన చేయఁ జారుగుణభాస్వర మారయసత్కవీశ్వరా !

మారన యాంధ్రకవులలో నన్నయ తిక్కనలను మాత్ర మీక్రింది పద్యము లతో స్తుతించినాఁడు.

         ఉ. సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా
             నారఁగఁ గొలుచున్ జనులు హర్షరసాంబుథిఁ దేలునట్లుగా
             భారతసంహిత న్మును తిపర్వము లెవ్వఁ డొనర్చె నట్టి వి
             ద్యారమణీయు నంధ్రకవితాగురు నన్నయభట్టుఁ గొల్చెదన్.

         చ. ఉభయ కవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సద్విహీతాధ్వర క్రియా
            ప్రభు బుధబంధు భూరిగుణబంధుర భారతసంహిత క్రియా
            విభుఁ బరతత్త్వకోవిదు నవీనపరాశరసూను సంతత
            త్రిభువనకీర్తనీయయశుఁ దిక్కకవీశ్వరుఁ గొల్తు భక్తితోన్.

మారన తన యాశ్వాసాంత గద్యములయందు 'శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం" బని చెప్పెను [1] మారనశైలిని సూచించెడు నయిదాఱు పద్యములను మార్కండేయపురాణములోని వాని నిం దుదాహరించుచున్నాను.

  1. [ఈ యాశ్వాసాంత గద్యనుబట్టి మారన తిక్కనసోమయాజి శిష్యుఁడనియు తిక్కనామాత్యుఁడను వేఱొకని పుత్రుఁడనియుఁ దెలియవచ్చుచున్నది. ఇందలి 'తిక్కనామాత్య పుత్ర' ఆను విశేషముగ బట్టి కొందఱు మారన తిక్కనసోమయాజి పుత్రుఁడని భ్రాంతిపడుచున్నారు. అది సరి కాదు. మారన తన్నుగూర్చి విశేషమేమియుఁ జెప్పనందున నితనింగూర్చి యెక్కువగా దెలియుట లేదు. ఇతని యితర రచన లేమియు నున్నట్లు కానcబడదు. ప్రతాపరుద్ర మహారాజు క్రీ.శ. 1265 మొదలు 1326 వఱకు నాంధ్ర రాజ్యమును పాలించినందున, మారన కవియు, నాగయ గన్నయయు, ఆ కాలముననే యుండిరనుట నిశ్చయమని 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు. (మూడవ సంపుటము. పుట 167)]