307
మా ర న
"భారతి"లోఁ బ్రకటింపఁబడిన పై వ్యాసమునుబట్టి ఉలూఫ్ ఖాను ప్రతాప రుద్రుని, నాగయగన్నసేనాని మన్నగు మఱికొందఱిని ఢిల్లీకిఁ బంపు చుండగా, ప్రతాపరుద్రుఁడు దారిలోనే మరణించినట్లును, సేనాని మహమ్మదీయ మతమును స్వీకరించి, రాజ్యకార్యములను నిర్వహించుచు, ఒకప్పు డోరుగంటి ప్రాంతమునకు నియమితుఁడై యుండియును ప్రజల కలవరము నణcపఁజాలక - కాపయనాయకుని ప్రతాపమున కోర్వలేక రాజ్యము నాతనికర్పించి ఢిల్లీకిఁ బాఱిపోయెననియుఁ దెలియుచున్నది]
పయికధ యెట్టి దయినను, నాగయగన్నఁడు ప్రతాపరుద్రుని కాలములోని వాcడు గనుక మారనయు పదుమూఁడవ శతాబ్దాంతము నందును, పదునాల్గవశతాబ్దాదియందును నున్నవాఁ డని తేలుచున్నది. కాబట్టి యతఁడిప్పటి కాఱువందల సంవత్సరముల క్రిందట నుండి యుండును. ఈ గన్నయ్యతల్లి మల్లాంబ కాకతీయ గణపతితలవరి యైన మేచయనాయకుని కూఁతురని యూ కింది పద్యమునఁ జెప్పఁబడినది.
సీ. ఏ రాజు రాజుల నెల్ల జయించి మున్
వెట్టికిఁ బట్టె దోర్విక్రమమున
నే రాజు సేతునీహారాద్రి మధ్యోర్యి
నేక పట్టణలీల నేలి (వాలె
నే రాజు నిజకీర్తి నెనిమిదిదిశల ను
ల్లాసంబు నొంద నలంకరించె
నే రాజు తనతేజ మీజగంబునకు న
ఖండై కవిభవంబు గా నొనర్చె
నట్టి కాకతి గణపతిక్ష్మాధినాధు
ననుఁగుదలవరి ధర్మాత్ముఁ డధికపుణ్యుc
డయిన మేచయనాయకు ప్రియతనూజ
నతులశుభలక్షణస్పురితామలాంగి
(నాగచమూవరుడు వరించె ...మల్లమాంబికన్ )
నాగయగన్నయ్య మార్కండేయపురాణమును గొంత పొగడి కవి నుద్దేశించి యీ కోరికను కోరినట్టు గ్రంధమునఁ జెప్పఁబడి యున్నది.