పుట:Aandhrakavula-charitramu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

299

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

           గదనంబుఁజేసి మడిసిరి

నదిసుత గురు కర్ణ శల్య నాగపురీశుల్.[1]

అథర్వణభారతములోని యిూ క్రింది మూఁడు పద్యములను నాంధ్ర సాహిత్యపరిషత్పుస్తకభాండాగారములో నున్న యుదాహరణపద్యగ్రంథము నుండి కైకొనఁబడినవి.

       సీ. రాజమండలపూర్ణరాజమండలవిథి
                        రత్నగర్బామలరత్నగర్చ
           గంధర్వగంధర్వగంధర్వనగరంబు
                        నాగపున్నాగ పున్నాగవనము
           మార్గణమార్గణమార్గణపీఠము
                        త్తుంగభుజంగభుజంగభూమి
           కాంతకాంతారాతికాంతకుంతస్థలి
                        వీరకుమారకుమారసరసి

           యనఁగఁ బొగడు కెక్కు నలకాపురంబు దే
           వేంద్రుపురము దానవేంద్రుపురముఁ
           గ్రేణి సేయు లలితశోణాంశుమణిబద్ద
           గోపురంబు హస్తినాపురంబు

      మ. నతనానావనినాథయోధమకుటన్యస్తాబ్జరాగోజ్జ్వల
          ద్యుతివిభాజితపాదపీఠు లలనాదోశ్చామరోద్ధూతమా

  1. ఈపద్య మల్పభేదముతో నన్నయభట్టారకుని యాదిపర్వమునందును గానc బడుచున్నది; గాని యీయర్థమే వచ్చెడి యీ క్రింది పద్యము దాని పయినే యున్నది గాన నిది యథర్వణ భారతములోనిదే యయి యుండవచ్చును. తరల. పదిదినంబులు భీష్మఁడాహవభారకుండు గురుండు పం చదివసంబులు గర్ణుఁడు న్దివసద్వయంబు దినార్థ మం దుదిత తేజుఁడు శల్యుం డత్యధితోగ్రవీరగదారణం బది దినార్ణముగాఁగ నిటు మహాభయంకరవృత్తితోన్