Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

293

అ ధ ర్వ ణా చా ర్యుఁ డు

వ్యవహారములో నుండినవి కావు. ఆంధ్ర వ్యాకరణములు చేసినవా రొక్క దేవతలును, ఋషులును మాత్రమే కారు. వారిలోఁ గవిరాక్షసునివంటి రాక్షసరాజులును గలరు. శ్రీరాములకు శత్రువైన రావణుఁడు కూడఁ దెలుఁగుభాషకు త్రేతాయుగమునందే వ్యాకరణము చేసెను.

'అనుక్తం సర్వశాస్త్రం తు | రావణీయే విలోకయేత్."

త్రిలింగశబ్దానుశాసనములో లేని విషయముల నన్నిటిని రావణవ్యాకరణములోఁ జూచి తెలిసికోవలెనఁట ! త్రిలింగశబ్దానుశాసన మన్నపేరు పెద్దదిగా నున్నను. దానిలోఁ జెప్పఁబడిన విషయములు మాత్ర మత్యల్పములు. ఈ కాలపు చిన్న వ్యాకరణములలో సాధారణముగాఁ జెప్పఁబడు లక్షణములు సహితము దానియందు లేవు. ఆరంభదశలోఁ జేయఁబడిన వ్యాకరణములలో దేనిలోను విశేషాంశము లుండవు. ఆ కాలములోనే చేయబడిన తిక్కన 'కవివాగ్బంధనము" మొదలైన లక్షణగ్రంధములలో సహితము విశేషాంశములు లేవు. ఆంధ్రభాషయే యెఱిఁగినట్టు కనcబడని బృహస్పత్యాదులు చేయని వ్యాకరణములను చేసినట్టు మన పండితులు చెప్పి రన్న విశ్వాసార్హముగా నుండునా ? యని మనవారు సందేహపడవచ్చును. ఎప్పటి పండితుల మాటయో యేటికి ? మన యీ కాలపు పండితులే యాంధ్రభాషా విషయమున 'భౌతిక కళానిధి" • లో నేమివ్రాసిరో చిత్త గింపుఁడు.

         శ్లో "యుగ భేదా డాంధ్రభాషాచార్య భేదః ప్రకీ ర్త్యతే
             కృతే సుధాయనః ప్రోక్తస్త్రేతాయాం శుకనాభకః || 1

             దివోదాసశ్చ శల్యాతి రింద్రమిత్ర స్తధైవ చ
             భాషాచార్యా ద్వాపరే స్యుస్తిష్యే భూన్నందివర్ధనః || 2
 
             తతో దేవళరాయశ్చ తస్య శిష్యో నియోగికః
             ఏతే క్రమా దాంధ్రభాషాచార్యా స్సప్త ప్రకీర్తితాః || 3

             అథాంధ్ర భాషానామాని యుగ భేదాత్ప్రచక్షతే
             ఆంధ్ర మాంధేయణం చైవ మల్లకో గుహ్యకస్తథా || 4