పుట:Aandhrakavula-charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

కన్నడ కవి సుప్రసిద్దుఁడు. " గజాంకుశుఁడు " కలఁడనికన్నడ కవి చరిత్ర కారులు తెల్పుచున్నారు. ఈ కన్నడ కవి క్రీ శ. 1000 ప్రాంతపువాఁడు, ఆంధ్ర కవియు, నీ కన్నడ కవియు నభిన్నులని శ్రీ వేంకటరావుగారియాశయము.[1]

మఱియు నీతనిం గూర్చి తెనుఁగు కవుల చరిత్రలో నిట్లు వ్రాయcబడినది - గజాంకుశుఁడనునది బిరుదమే కావి స్వతస్సిద్ధమగు పేరు కాదు. ఈతని పేరు నారాయణుఁడు. ఈతఁడు రాష్ట్రకూటరాజగు మూడవ కృష్ణచక్రవర్తి కాలమున ప్రధానియై ప్రసిద్ధికెక్కెను. మూఁడవ కృష్ణచక్రవర్తి క్రీ.శ. 939 నుండి 968 వఱకును 29 యేండ్లు పరిపాలించినాఁడు.

రామపార్యసుత శ్శ్రీమాన్ వదాన్యోయం౽యం ప్రతాపవాన్
నారాయణాభిధానేన నారాయణ ఇవాపరః,
విఖ్యాతో భువి విద్యావాన్ యో గజాంకుశ సంజ్ఞయా
ప్రధాన8 కృష్ణరాజస్య మంత్రీసన్ సంధి విగ్రహా

  • * * * * * *

పారగోరాజవిద్యానాం కవిముఖా8 ప్రియంవదాః(?)
యస్తు ధర్మరతో భాతి ధర్మోవిగ్రహవానివ.

గజాంకుశుఁడు కవి యని తెలియనగునను భావమున శ్రీ వేంకటరావుగారు "క్షవిముఖాః" అను దాని నధోరేఖాంకితము చేసినారు, కాని వా రొసఁగిన యా భాగము అనన్వితమగుటచే, అది సరియైన పారముగాఁ దోఁచుటలేదు. ఇంతకును గజాంకుశుని రచన యాంధ్రమున లభ్యము కాలేదు. కావున ఆంధ్ర, కన్నడ గజాంకుశుల యభిన్నతను గాని, ఆంధ్ర గజాంకుశుని - లేదా - నారాయణుని కాలమును గాని నిర్ణయింపఁదగిన కారణము లపేక్షణీయములు.

(8) " ప్రబంధ రత్నావళి " యందలి యుదాహృతులను బట్టి సర్వ దేవుఁడను నొక కవి యుండెననియు, ఆతడు ' ఆదిపురాణ ' మను జైన గ్రంధమును,


  1. చూ, తెనుఁగు కవుల చరిత్ర. పుటలు 88, 89.