Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

నన్నయభట్టభారతమునకంటెను బ్రాచీన మయినదని చూపుటకయి పాడి వెంకటస్వామిగా రాంధ్రపత్రికయుగాదిసంచికలోఁ దమ వ్యాసమునందు బెర్నలుగారు చెప్పిన హేమచంద్రుని బాధ తొలంగునట్లుగా 'హేమచంద్రాది మునిభిః కథితం చాంద్రలక్షణం' ఇత్యాది శ్లోకములలో హేమచంద్రు డన్నది సోమచంద్రుఁ డని యుండవలెనని చెప్పిరి. హేమచంద్రుఁడె ట్లాంధ్రవ్యాకరణకర్త గాcడో యట్లే సోమచంద్రుఁడును నాంధ్రవ్యాకరణ కర్త కాఁడు. ఈ మార్పు సహితము త్రిలింగశబ్దానుశాసన మత్యంత పురాతనమని సాధించుటకుఁ బనికి రాకపోవుటయే కాక, యధర్వణా చార్యుఁడు మఱింత యర్వాచీనుఁడని చూపుటకే తోడుపడుచున్నది. జైన పండితుఁడయి సోమదేవుఁ డనఁబడెడి యీ సోమచంద్రుఁడు 1205-వ సంవత్సరమునందు 'శబ్దార్ణవ చంద్రిక' యను సంస్కృతవ్యాకరణమును రచియించెను. సోమచంద్రుఁ డన్న పాఠమునకంటెఁ ద్రిలింగశబ్దానుశాసనములో ననేక స్థలములయందున్న హేమచంద్రుఁ డన్న పాఠమే సరియైనది. త్రిలింగశబ్దానుశాసనమునందు "హేమచంద్రుఁడు మునిఁగా జెప్పఁబడినాఁడు; ఆందు విశేషమేదియు లేదు. జైనులు తమ విద్వాంసులను మునులనుగా జెప్పుటయు, విద్వాంసులే తమ్ము మునులనుగాఁ జెప్పకొనుటయు నాచారమయి యున్నది. కర్ణాటకశబ్దానుశాసనమును రచియించిన యకలంకభట్టు "భట్టాకలంకో మునిః" అని తన్నుఁగూర్చియే తన పుస్తకములోఁ జెప్పుకొనెను.

        శ్లో. "బార్హస్పత్యాని సర్వాణి | కాణ్వం వ్యాకరణం విదన్
            కరో మ్యధర్వణం శబ్దం | సర్వలక్షణలక్షితం."

అని బృహస్పతివ్యాకరణమును, కణ్వవ్యాకరణమును సర్వమును జూచి తా నీ వ్యాకరణమును రచియించిన ట్లారంభములోనే యధర్వణుడు సెప్పుచున్నాఁడు. ద్రావిడులు తమ యఱవభాష కగస్త్యుండు వ్యాకరణము చేసెనని చెప్పకొనునట్లే తెలుఁగువ్యాకరణములు సహితము ఋషిప్రోక్తము లన్నచో భాషకు గౌరవము వచ్చునని గొప్పకు చెప్పకొన్నవే కాని యీ వ్యాకరణము లన్నియుఁ గవీశ్వరుల మానస సృష్టిలోనివేగాని యెప్పుడును