Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మొదట నొక యాంధ్రవ్యాకరణమును జేసి యటుపై నింకొక యాంధ్ర వ్యాకరణమును జేయుట తటస్థింపదు. అధర్వణకారిక లనబడెడు వికృతి వివేకము మిక్కిలి యాధునికమని చూపుటకుఁ జాలినన్ని నిదర్శనములా పుస్తకమునందే యున్నవి. పూర్వకవు లెవ్వరును శ్రీవాచక తత్సమపదముల కకారాంతములకు సంధి కూర్చి యుండలేదు. ఈ నియమమును మీఱి "గంగానుకాసె", "శ్రీరంగభర్తంచు" అని యాము క్తమాల్యదయందు 1508 మొదలుకొని 1530 -వ సంవత్సరమువఱకును కర్ణాటకసామ్రా జ్యము నేలిన కృష్ణదేవరాయ లకారాంత తత్సమములకు మొట్టమొదట సంధిని గూర్చినవాఁడు. ఆతనికిఁ బూర్వ మెన్నఁడును లేని యీ నూతన ప్రయోగములకు 'కుత్ర చిత్సంస్కృతీయో పి ప్రాణోప్యత్రచ్యుతో భవేత్' అని యధర్వణకారికలయందు లక్షణము విధింపఁబడి యున్నందున కారికల కర్త 1530 వ సంవత్సరమునకుఁ దరువాతివాఁ డయి యుండవలెను [1]

  1. [అథర్వణకారిక లనబడు 'వికృతివివేకము' అథర్వణకృతిగా 'తెనుఁగు కవుల చరిత్ర" యందుఁ జెప్పఁబడినది. మఱియు'ఇందలి (వికృతి వివేకము నందలి) లిపిశ్లోకములలో నుదాహరింపబడిన యక్షర విన్యాసమును బట్టి డాక్టరు బర్నెలు (Dr Burnell) దొరవారీతని పండ్రెండవ శతాబ్ది నున్నవాఁడని భావించిరి. ఇది సమంజసమే ! నన్నయభట్టారకుని వెనుక తిక్కనకు ముందుగా భారతమును పూరించుటకుఁ బూనుకొనిన యాంధ్రకవి యథర్వణుఁడు కాని యథర్వణుని కవిత, యతి సంస్కృత పద భూయిష్ఠ మగుట చేత వ్యాప్తిలోనికి రాలేదు. శైవకవితాప్రభావము వలన తిక్కన తెనుగుదనము చూపుచు రచించిన భారతము ముందఱ నధర్వణుని భారతము నిలువ లేదు.' అనియుఁ గలరు. (తెనుగుకవుల చరిత్ర-పుటలు ౩౦౩,304) ఆథర్వణుఁడు తిక్కనకుఁ దర్వాతివాఁడనియామి, నితని కాలము క్రీ శ.1250 ప్రాంతమని తలంపవచ్చుననియు, త్రిలింగ శబ్దానుశాసన, వికృతవివేకములను ఆధర్వణుఁడు రచింపలేదనియు, 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు. (చూ. తృతీయ భాగము. అధర్వణాచార్యుఁడు ) అథర్వణుఁడు తొలుతఁ ద్రిలింగ శబ్దానుశాసనమును రచించి, పిదప వివరముగా- వికృతి వివేకమును రచించెనని శ్రీ వజ్ఝల - చిన సీతారామస్వామి శాస్త్రులుగారు 'అధర్వణ కారికావళి' పీఠికలోఁ దెల్పి యున్నారు. శ్రీ తిమ్మావజ్ఝల కోదండ రామయ్యగారు విజయ-మార్గశీర్షమాస 'భారతి'లో అధర్వణ భారతము అను వ్యాసమున అథర్వణాచార్యుని భారతము గూర్చిన యమూల్య విషయములను దెల్పిరి. ఇంత వఱకు నధర్వణcడు భారతములోని విరాటో