పుట:Aandhrakavula-charitramu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధర్వణాచార్యుఁడు

అధర్వణాచార్యుని కాలమును నిర్ణయము చేయుటకుఁ గొన్నియాధారములు కనఁబడుచున్నవి. దక్షిణ హిందూస్థాన ప్రాచీనలిపి శాస్త్రమును రచించిన బర్నెల్ దొరవా రధర్వణకారికలలో నక్షరములనుగూర్చి వ్రాయఁబడిన

        శ్లో. పంచవరాదయో వర్ణా శ్శంఖశార్ఙ్గాదిసన్నిభాః
            తిర్వగ్రేఖాయుజ శ్చోర్ధ్వం దండ రేఖాన్వితా అధః.
            త ఏవ చ ద్వితీయా స్స్యురూర్ధ్వరేఖాద్వికాన్వితాః
            ప్రధమా స్తు ద్వితీయాస్స్యు స్తృతీయాస్తే చతుర్థకాః.
            రేఖాద్వయాధో దండేన యుక్తాస్స్యు రనునాసికాః
            మిళద్దండద్వయోపేతాః ప్రధమా లిపయః స్మృతాః

ఇత్యాది శ్లోకముల నుదాహరించి, తెలుఁగక్షరములలోఁ బైని జెప్పఁబడిన మార్పులు పండెండ్రవ శతాబ్దాంతమువఱకును గలుగనందున, అధర్వణాచార్యుఁడు పండెండ్రవ శతాబ్దాంతమునకుఁ గాని పదుమూడవ శతాబ్దారంభము నకుఁగాని పూర్వుఁడయి యుండఁజాలఁడని వ్రాసి యున్నారు. ఆ గ్రంధము లోనే దొరవా రింకొకచోట నధర్వణాచార్యుఁడు తన త్రిలింగశబ్దాను శాసనములో ప్రథమపరిచ్ఛేదము అయిదవ శ్లోకములోను, తృతీయపరిచ్ఛేదము పదుమూడవ శ్లోకములోను హేమచంద్రునిపే రుదాహరించి నందున 1088 -వ సంవత్సరమునఁ గాఁబోలును పుట్టి 1132-వ సంవ త్సరమునందు మృతినొందిన హేమచంద్రుని తరువాతివాఁడని వ్రాసినారు.

అధర్వణకారిక లనఁ బడునవి యధర్వణార్యువిచే రచియింపఁబడినవి గాక మఱి యెవ్వరిచేతనో యొక యాధునికునిచేత నాతని పేరు పెట్టి యిటీవల రచియింపఁబడిన వయినట్టు కనఁబడుచున్నవి. కాబట్టి యా కారికావళిని బట్టి యాతనికాలమును నిర్ణయించుటకు వలనుపడదు. అతఁడు మొట్ట