4
రెండు శాసనములనియు, ఇందలి చివఱి భాగమును బట్టి యుద్దమల్లుడు, తన తాత మల్లపరాజు కట్టించిన గుడికి గోపురమును గట్టించెనని స్పష్టమగు చున్నదనియు శ్రీ వేంకటరావుగారు వ్రాయుచున్నారు. 6ఈ శాసనము గుణగవిజయాదిత్యుని శాసనమున కించుమించుగా ఏఁబదియేండ్లకుఁ దర్వాత పట్టినదని కీ.శే. శ్రీ జయంతి - రామయ్యపంతులుగారు వ్రాసిరి. 7ఇయ్యది యసమగ్రము.
శాసనమును బట్టి దీని కర్త యెవ్వరైనదియుఁ దెలియదు. వీరశైవ పండిత త్రయములోఁ దొలివాఁడగు శ్రీపతి పండితుఁడే యీ శాసనమును గూర్చెనని శ్రీ వేంకటరావుగారు చెప్పుచున్నారు. శ్రీపతి పండితుఁడు బెజవాడ వాస్తవ్యుడగుటయు, కవి యగుటయు, మల్లేశ్వరాలయమున నిప్పులు మూటగట్టి శివభక్తి మహిమను బ్రదర్శించుటయుఁ దమ యూహకుఁ గారణముగా వివరించినారు8 -ఈ యూహ కింకను ప్రబలములగు హేతుపు లావశ్యకములు. (6) కీ.శే శ్రీ వేటూరి-ప్రభాకరశాస్త్రిగారు సంతరించిన "ప్రబcధరత్నావళి" లో పద్మకవి రచనగా నొక సీసపద్య మీయఁబడినది. అది 'జినేంద్రపురాణము' లోనిది. 'జినేంద్రపురాణము' ను రచించిన పద్మకవియే కన్నడవాఙ్మయమున ఆదికవి యని చెప్పఁబడు పంప మహాకవి యని శ్రీ వేంకటరావుగారి యభిప్రాయము. 9ఉపలబ్ధమగు పద్యము ప్రాచీనతర రచనగా దోcచలేదని శ్రీ ప్రభాకర శాస్త్రిగారు తెల్పియున్నారు. 10 పద్మకవియే పంపకవి యని నిశ్చయమైనచో, అతఁడు నన్నయ కంటెఁ బ్రాచీనుఁడు కావచ్చును.
(7) మడికి సింగన సమకూర్చిన 'సకల నీతిసమ్మత' మను గ్రంధమున నీయcబడిన కృతి, కృతి కర్త్రృ నామములో 'గజాంకుశ" ప్రశస్తి కలదు.
(6) చూ. తెనుఁగు కవుల చరిత్ర, పుట 55, (7) చూ. శాసనపద్యనుంజరి - పీఠిక (8) చూ. తెనుఁగు కవుల చరిత్ర పటలం 88, 69. (9) చూ—. "తెనుఁగు కవుల చరిత్ర. పుటలం 88, 84. (10) ప్రబంధ రత్నావళి, పీఠిక. పుట 27.