పుట:Aandhrakavula-charitramu.pdf/302

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

275

బ ద్దె న క వి

బద్దెనకవి తిక్కనసోమయాజులకాలపువాఁడు. ఈతనికవిత్వము సులభమయి మృదువయి మనోహరముగా నుండును. నీతిశాస్త్రముక్తావళిలోని రెండు పద్యముల నిందుఁ బొందుపఱచుచున్నాను.

     ఉ. 'ఎత్తినకాలకొని సిరి కెన్నఁడు నిల్చిసకాల నిల్వఁగాఁ
          జిత్తము లేదు గాన సిరి చెందిననాఁడ పరోపకారముల్
          హత్తి కడంగి చేయుఁ డెడరై నఁ బదంపడి వేcడుకొందమన్
          చిత్తమె కాని యిత్త మను చిత్తము పుట్టునె యెట్టివారికిన్ ?

     ఉ. వాన సమస్తజీవుల కవశ్యము ప్రాణము ప్రాణ మైన య
         వ్వానయుఁ బల్మఱుం గురియవచ్చిన దిట్టుదు రెల్లవారలున్
         హీనమనస్కుఁడై యొరులయిండ్లకుఁ బల్కఱుఁ బోవునేనియున్
         మానిసి కట్ల వచ్చు నవమాన మునూనము మానభంగమున్.'

                          సుమతి శతకము

      క. ఎప్పుడు సంపద గలిగిన
         నప్పుడు బంధువులు వత్తు రది యెట్లనిన్
         దెప్పలుగఁ జెఱువు నిండినఁ
         గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ !

      క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
         మప్పటి కామాటలాడి యన్యులమనసుల్
         నొప్పింపక తా నొవ్వక
         తప్పించుకు తిరుగువాఁడు ధన్యుఁడు సుమతీ ! [1]

  1. [ఈ పద్యములు బద్దెన రచించిన 'సుమతిశతకము లోనివని చెప్పటకుఁదగిన యాధారములు లేవు. ముద్రిత ప్రతిలో లేని పద్యములు కొన్ని ప్రాఁత ప్రతులలోఁ గా నవచ్చుచున్నవి. వీని శైలియు భిన్నముగా నున్నది.

            'సుమతిశతకము' భీమనకృత మొకటి యున్నదని తిమ్మకవి రచించిన సర్వ లక్షణ సారసంగ్రహమునుబట్టి తెలియుచున్నది అయ్యది లభింపలేదు. ఆ భీమకవి 'వేములవాడ భీమకవి'యని యనుటకును ఆధారములు లేవని 'ఆంధ్రకవి తరంగిణి' (రెండవ సంపుటము పుట 17) ప్రస్తతను ప్రచారములోనున్న సుమతీశతకము బద్దెన కృతికంటె విభిన్నము కావచ్చును.]