పుట:Aandhrakavula-charitramu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

తెలిఁగించిరో గాని రామకృష్ణకవిగారు పోలిక పద్యము లని నీతిసారము లోనిబద్యములను పదింటికంటె నెక్కువగా నుదాహరించి యున్నారు. వానిలోని పద్యములను రెంటిని వానిని పోలియున్నవన్న బద్దెనీతిలోని పద్య ములను రెంటిని నిచ్చట నుదాహరించు చున్నాను.

         గీ. 'విమతులా వెఱింగి వెఱఁపేది తొడరుట
            మిడత లగ్గిమీఁదఁ బడినయట్లు
            తోడులేక యధికుఁ దొడరుట యంబుధిఁ
            గలము లేక యీదఁ గడఁగినట్లు' (నీతిసారము)

        ఉ. వారని యల్కఁజేసి కడవం బలవంతుఁడు విగ్రహించినన్
            దూరము పోవుటొండె వినతుండయి వానిన చొచ్చుటొండెఁ గా
            కీరసమెత్తి కోల్మతివిహీనత నేనుఁగుతోడ లావునన్
            బోరగు నెన్ముచంద మది బుద్ధియె రాజమనోజభూభుజా !
                                                       (నీతిశాస్త్రముక్తావళి)
         క. దూరము వ్యవసాయకులకు
            భారంబు సమర్ధులకును భాసురవిద్యా
            పారగులకును విదేశము
            వైరము ప్రియవాదులకును వసుమతిఁ గలదే ? (నీతిసారము)

        చ. అమరఁగ విద్య గల్గిన మహాత్మున కెద్దెస వోయినన్ స్వదే
            శమ కడవన్ సమర్థున కసాధ్యమయొద్ది కడంగి చేసినన్
            సమధురవాణియైన గుణశాలికి నెయ్యురె యెవ్వరున్ బటు
            త్వముగలవానికిం గొలువు తద్దకురంగట బద్దె భూపతీ
                                                       (నీతిశాస్త్రముక్తావళి)


ఈ కడపటి పద్యములు రెండును

       శ్లో. 'కో౽తిభార స్సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం,
            కో విదేశః సవిద్యానాం క8 పరః ప్రియవాదినామ్.'

అను శ్లోకమునకుఁ దెనుఁగు