పుట:Aandhrakavula-charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

శాసనకవియయి యుండునని శ్రీ నిడుదవోలు వేంకటరావుగా రూహించుచున్నారు.[1]. ఇందు తరువోజయును. కొంత గద్యభాగమును గలవు.

(2) దీని తర్వాతిది కందుకూరిలో లభించిన పద్యమయ శాసనము ఇది పూర్తిగా లేదు. ఇందలి లిపి తూర్పు చాళుక్యులనాఁటిదఁట ! ఇందలి పద్యము సీసపద్యమని కీ.శే. శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరాపుగారు గుర్తించిరి. ఇయ్యదియు గుణగవిజయాదిత్యునకు సcబంధించినదని శ్రీ నిడుదవోలు - వేంకటరావుగారు తెల్పుచున్నారు 3

(3) గుణగవిజయాదిత్యుని నాఁటిదే యని చెప్పఁబడుచున్న ధర్మవరము శాసన మొకటి పద్యమయము కలదు.4ఈ శాసనము ప్రారంభమున 'స్వస్తి సర్వలోకాశ్రయ .. (క్య) భీమమహారా(జులవి) జయరాజ్యస (౦) వత్సరంబు - (యే) నగునే (ణ్ణి) ఉత్త (రా) యనస (౦క్రాన్తి) స్థితి ' ఆవి యుండుటం బట్టి యిది చాళుక్యభీమమహారాజు శాసనమని ప్రసిద్ధము. ఇది యత్కర్తృకమో తెలియదు

(4) ఏడువాడలపాలెపు శాసనము నొకదానిని కీ.శే. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు పరిచయము చేసిరి. 5 శాసనములోని 'స్వస్తి - సకాబ్ద౦బు ల్దోంభ నూటానల్వదియగు నేణ్ది - " అను దానినిబట్టి యిది క్రీ. శ. 1018 నాఁటిదని తెలియుచున్నది.


(5) నన్నయ కంటెఁ బ్రాచీనములగు శాసనములలో ముఖ్యమైనది "యుద్ద మల్లుని బెజవాడ శిలాశాసనము". ఇది యుద్ధమల్లుఁడను చాళుక్యరాజు బెజవాడలోఁ గుమారస్వామికి గుడియు, దానిఁ జేర్చి యొక మరమును కట్టించి. ఆ మరములో తై వేతరులు నివసింపరాదని యేర్పాటుచేసి చెక్కించిన శాసనము బాగుగఁ బరిశీలించినచో నిది యొక్క శాసనము కాదనియు,



(3) చూ. "తెనుఁగు కవుల చరిత్ర పుట 88 (4) డా.నేలటూరి వేంకటరమణయ్యగారి గుణగవిజయాదిత్యుని వర్తమానములు. భారతి 23, 24 సం.

(5) చూ. రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక(2)

  1. చూ. తెనుఁగు కవుల చరిత్ర - పుట 23.