పుట:Aandhrakavula-charitramu.pdf/298

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

271

బ ద్దె న క వి

'స్వస్తి సమస్తప్రశస్తిసహితం శ్రీమన్మహామcడలేశ్వరవీర నారాయణ చోడబద్దిగ దేవరాజులు శతశవర్షంబులు 1183 ణ్డగు నేంటి కర్కాటక సంక్రాంతినాండు ...................' అనునంతవఱకు నుండి తరువాత శిధిల మయినది. ఉత్తరపువైపున పడమటి వైపున నున్న రెండవ శిలాశాసనము

         శ్లో, 'శ్రీనాధనాభినీరేజసంభూత బహ్మణ8 పురా
              జాతా విశ్వగుణాక్షీణలక్ష్మీ రాజపరంపరా
              తస్యాం బద్దిగభూపో౽భూద్వీరనారాయణాంకితః
              చోడదోరయ (భూపో) స్యపుత్రో .. దస్య నందనః
              శ్రీ శాకాబ్దే పురాష్టాదశ శశిగణతే కర్కసంక్రాంతికాలే
              స ప్రాదా ద్దీప మిష్ట ప్రద మనవరతం చోడ బద్దిక్షితీశః
              శ్రీమద్బ్ర హ్మేశ్వరాయా శశి రవి విశదంగోంకనాంకస్య (వేః) తే
              స్తద్దీపార్థం చ వేలేటిజనపదమహీం వింశతి ద్రోణసంఖ్యాం."

అని పూర్తిగా నున్నది. ఇందుఁ జెప్పఁబడిన శాలివాహనశకము 1183

క్రీస్తుశకము1261 అగుచున్నది. "ఈ శాసనములు పుట్టిన కాలమునందు కాకతీయరాజ్యము రుద్రమదేవి పాలించుచుండెను. ఆమె క్రింద సామంతుడుగా నుండి బద్దెన కృష్ణాతీరమం దొక చిన్న రాజ్యమును బాలించుచుండినట్టు కనుపట్టుచున్నది." అని రామయ్యపంతులుగారు వ్రాసియున్నారు.[1]

  1. శ్రీరామకృష్ణకవిగారు తెల్పిన 'రాజనీతియు, పరువడి' అను పద్యములు రెండును బద్దెన కృతములు కావననియు బాలబోధకై వేఱొక గ్రంథమును వ్రాసిన వేఱొక కవివని యు, ఆకవిని గూర్చియు, గ్రంథమును గూర్చియు తెలియదనియు 'ఆంధ్రకవి తరంగిణి' కారులు వ్రాయుచున్నారు [మూcడవ సంపుటము. పుటలు 18,19] శ్రీరామయ్య పంతులుగా రిచ్చిన శాసనములను బట్టి రామకృష్ణకవిగా రిచ్చిన కాలము సరియైనది కాదని, తేలును. వీనింబట్టి బద్దెనృపాలురు తాతయు మనుమఁడు నగుదురు. శాసనకర్త మనుమఁడగును, తాతకాఁడు, నీతిశాస్త్రముక్తావళికర్తయు, శాసనకర్తయు నభిన్ను లనుట కింకను తగిన యాధారములు లభింపలేదు. తాత గ్రంథకర్తయైనచో క్రీ. శ.1200 ప్రాంతము వాఁడగును; శాసనకర్తయే గ్రంథకర్తయగునేని క్రీ.శ.1260 ప్రాంతము వాఁడగును.