270
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
నిల నరాజకవృత్తి హితసేవకస్థితి
దుస్సేవక క్రియ దుష్టరాజ
సేవా బలము దానశీలతా మహిమ వి
వేకసంగతియును లోకనీతి
పద్దతులు చేసి భువి నతిప్రజ్ఞ వెలయ
బద్దెనీతియుఁ గోమటి డుచునోళ్ల
కతన దబ్బఱపారంబు గదియ గవులు
తప్పు లెడలింప నెంతయు నొప్పు భువిని'.
అను మొదటిపద్యము క్రిందనే యొక ప్రతిలో రామకృష్ణకవిగారు 3ం వ పుట లో నుదాహరించిన యీ క్రింది పద్యమున్నది.
చ. "పరువడి నాంద్రభాష గల బద్దె ననీతియు,సంస్కృతంబు లోఁ
బరఁగఁ బ్రతాపరుద్ర నరపాలునిచే రచింపఁబడ్డ యా
నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచుఁ జే
చ్చెరఁ గవి నీతిపద్దతులు చేసె వినోదము బాలబోధకున్."
దీనినిబట్టి బద్దెనకవి ప్రతాపరుద్రుని తరువాతివాఁడని స్పష్టముగాఁ దెలియ వచ్చుచున్నది. పయి పద్యము నందుఁ బేర్కొనఁబడిన మొదటి ప్రతాప రుద్రుడు 1140 మొదలుకొని 1196 వ సంవత్సరమువఱకును రాజ్య పాలనము చేసినవాఁ డగుటచే బద్దెనరపాలుఁడు నిస్సంశయముగా క్రీస్తు శకము 1196 వ సంవత్సరమునకుఁ దరువాతివాఁ డయి యుండవలెను. ఈ నడుమను బహ్మశ్రీ రామయ్యపంతులుగారు,రాక్షసనామ సంవత్సర భాద్రపదమాసమునందు (సెప్టెంబరు1916 ) ప్రచురింపఁబడిన యాంధ్ర సాహిత్యపరిషత్పత్రిక నాల్గవ సంపుటము 3 -వ సంచికలోఁ బ్రకటించిన రెండు శాసనములను బట్టి కవికాలము 1261 వ సంవత్సరప్రాంత మని స్పష్టపడినది. ఈ శాసనములు కృష్ణా మండలములోని గన్నవరము తాలూకాలో కొండనాయనివర మను గ్రామమునందు బ్రహ్మేశ్వరస్వామి యాలయములో నొక రాతిపలకమీఁదఁ జెక్కఁబడి యున్నవి. ఇందలి మెదటి శిలా శాసనము