265
కే త న
క. మాటలు నేరక పలికిన
నోటమిగాఁ గొనక కార్య మున్న నిజముఁ దాఁ
దాటించి నృపతి ధర్మం
బేటముగాఁ బాడి నిర్ణయింపఁగ వలయున్ --- వ్యవ.
ఉ. వేకనిబండివానికిని విప్రునికిన్ బతికి న్వివాదికిన్
వ్రేఁకపు మోపువానికిని వృద్ధునికిన్ గడుఁజిన్నబిడ్డకున్
వ్రేఁకటియాడుమానిసికి వేదుఱువానికిఁ దెవ్లుగొంటుకున్
దేఁకువతోఁ దొలంగునది తెల్లముగా నెదు రేగుదెండెంచినన్
----ప్రాయశ్చిత్త
ఈ కవి బాణభట్టవిరచిత మయిన కాదంబరిని తెనిఁగించినట్ల కనఁబడుచున్నది. కేతనకృత మయిన కాదంబరిలోనిదని రంగరాడ్ఛందమునం దీ పద్యముదాహరింపఁబడియున్నది.
గీ. 'జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెరఁగిన
నా విభుండు వాని లేవనెత్తి
కౌగిలించి వానిఁ గనుఁగొని కేయూర
కాభిధాన మొసఁగెఁ గడుముదముస'
కాదంబరిలోని వని యుదాహరింపఁబడిన పద్యములలో నొక దానియందు భాస్కరునికేతన యని యుండుటచేత కాదంబరి గ్రంథకర్త యితఁడు గాక తిక్కనసోమయాజి పెదతండ్రి యైన కేతన యని తోఁచుచున్నది.[1]
అభినవదండి యను నామాంతరము గల యీ కేతనకవిచేత విరచితమైన దశకుమారచరిత్రము పండ్రెండాశ్వాసముల పద్యకావ్యము నా కీ నడుమ లభించినది. ఆ గ్రంధములోని
- ↑ [ కేతనమంత్రి చరిత్రమును జూడుఁడు ]