Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2


అది ప్రాచీనకాలము నుండియు ఆంధ్రుల ప్రశంస శ్రుతి పేయమగుచున్నను క్రీస్తు శకము 10 శతాబ్దులు గడచిన వఱకును, - అనగా నన్నయభట్టు మహాభారత రచనకుఁ బ్రారంభించు వఱకును చెప్పకొనఁదగిన వాఙ్మయమాంధ్రమున వెలయకుండుట కడుంగడం విచార హేతు పగుచున్నది. అంతకుఁ బూర్వము వెలువడిన వాఙ్మయము లభ్యము కానంతమాత్రమున నన్నయకుఁ బూర్వ మాంధ్ర వాఙ్మయము లేనేలేదని చెప్ప వలనుపడదు. నన్నయ రచనయే ఆంధ్ర వాఙ్మయమున కారంభమైనచో, ఆట్టి యుత్కృష్ణ కవిత వెలుపడుట అసంభావ్యమని విమర్శకుల యాశయము.


నన్నయకుఁ బూర్వమున గ్రంథ రూపమున తెలుఁగు వాఙ్మయము వెలువడ కున్నను శాసనములందుఁ గొన్ని పద్యములును, గద్యలును కానవచ్చుచునే యున్నవి. వానిని పరిశీలించినచో, శాసన రచయితలు విద్వత్కవులని తెలియక మానదు. వారు సంస్కృతమునందును నిష్ణాతలని యా శాసనములే చాటుచున్నవి.

శాసన రచయితలను కొందరికిని కొందరు చరిత్రకారులు కవులుగాఁ బరిగణించిరి. 1[1]శాసనమునఁ గొలఁది పద్యములను గూర్చినంతమాత్రమున -- అట్టి రచయితలను రచయితలనుగాఁ బరిగణింపనక్కఱలేదని కొందఱు విమర్శకుల యాశయము. అట్టి వారు కవుల పట్టిక కెక్కినను - ఎక్కకున్నను - నన్నయకుఁ బూర్వమున నుండిన తెలుఁగు వాఙ్మయము స్వరూపమును దెలిసికొనుటకు - అట్టి శాసన కర్తలను గూర్చి కొంతవఱకుఁ దెలిసికొనుట యప్రస్తుతము కాcజాలదు.

(1) ఉపలబ్ధములగు శాసనములలో క్రీ. శ. 848 ప్రాంతమునాఁటి "అద్దంకి" శాసనము మొదటిది. ఇది చాళుక్య వంశీయుఁడగు గుణగవిజయాదిత్యుని ప్రథమ రాజ్య సంవత్సరమునాఁటిదcట • పండరంగఁడను సేనాధిపతి తన ప్రభువు గుణగవిజయాదిత్యుని పేరిట ఆదిత్యభట్టారకునికి కొంత నేల దానము చేసినట్ట్లిందుఁగలదు. దీని కర్త యెవ్వరో తెలియరాలేదు పండరంగఁడే

  1. (1) చూడుఁడు - శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి 'తెనుఁగు కవుల చరిత్ర'