262
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
ఈతడు దండివిరచిత మయిన దశకుమారచరిత్రమును తెనిఁగించుట చేతఁ బండితు లీతని "నభినవదండి" యని పొగడినట్లీక్రింద నుదాహరింపబడెడి యాంధ్రభాషాభూషణములోని పద్యములో కవియే చెప్పచున్నాడు.
క. "వివిధ కళానిపుణుఁడ నభి
నవదండి యనంగ బుధజనంబులచేతన్
భువిఁ జేరు గొన్నవాఁడను
గవిజనమిత్రుఁడను మూలఘటికాన్వయుఁడన్."
ఈ కవియింటిపేరు పైని పేర్కొనఁబడినట్లు మూలఘటికవారు; ఈతని తండ్రి పేరు మ్రానయ్య. [1] ఇతఁడు శివభక్తుఁడు. ఇతర డాంధ్రభాషాభూష
- ↑ ఈతని తండ్రి మ్రానయయైనట్లు విజ్ఞానేశ్వరము నందలి ప్రాయశ్చిత్త కాండములో కడపటనున్న యీ క్రింది పద్యమువలన నెఱుఁఁగవచ్చును.
క. 'తజ్ఞులకఁ దెలియునట్లుగఁ
బ్రాజ్ఞులు మది మెచ్చఁ దెలుఁగుసపద్యములను ద
త్వజ్ఞుడు మ్రానయ కేతన
విజ్ఞానేశ్వరము జగతి వెలయఁగఁ జెప్పెన్'
[ఇతని తల్లి గంగమాంబ. నివానాసము వెఱ్ఱి (వెంటి , రాలు ]
ధర్మశాస్త్రములను కేతనయే మొట్టమొదట తెనిఁగింప నారంభించెను. ఇటీవలి కవులు సహితము మఱి యెవ్వరును ధర్మశాస్త్రముల నాధ్రీకరింపఁ బూనుకోలేదు. కేతనయొక్క విజ్ఞానేశ్వరములోని మఱి రెండు పద్యముల నిం దుదాహరించు చున్నాను.
చ. ఒకనికిఁ గూఁతు నిచ్చి తగ మంకువ గైకొని పెండ్లిసేయ ను
త్సుక మతి నున్నచోట గుణశోభితుఁ డొక్కఁడు వచ్చె నేనియున్
బ్రకటిత దోషముల్ మొదటి భర్త పయిం గలవేని తండ్రి క
న్యక గుణవంతుఁ డైన పతి కచ్చుగ నిచ్చుట ధర్మ మెమ్మెయిన్. ఆచారకాం.
ఉ. జాతర పెండ్లియత్సవము జన్నము చేయఁ దొడంగియున్నచో
బాఁతిగ రాజమంత్రులు తపస్వులు వేల్పు లవశ్యకార్యముల్
ప్రీతి నొనర్చుచోఁ దఱిమి పిల్వఁగ నప్పను లెల్లఁ దీరఁగా
భూతలనాథుముద్ర గొనిపోయిన భృత్యులు వారిఁ దేఁదగున్. వ్యవహార.