పుట:Aandhrakavula-charitramu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రంగనాధరామాయణ మిప్పటి కేడు వందలసంవత్సరముల క్రిందట రచియింపఁబడినది. కొందఱీ కవి కోనబుద్దారెడ్డి కాలములో దూపాడుపరగణాకధికారిగా నుండెననియు, బుద్దారెడ్డి ప్రతావరుద్రునికి లోcబడిన సామంత రా జనియు, చెప్పచున్నారు. ఆ ప్రతాపరుద్రుని గణపతిదేవుని తండ్రి యైనపక్షమున, ఇప్పడు చెప్పిన కాలము సరిగానే యుండును. అట్లుగాక యా ప్రతాపరుద్రుఁడు గణపతిదేవుని మనుమఁ డనెడి పక్షమున, కవి కాలము మఱి యఱువదేండ్లు తరువాత కావలసివచ్చును. అనేక హేతువులనుబట్టి యీ గ్రంథము మొదటి ప్రతాపరుద్రుని కాలములోఁ జేయcబడినదే యైనట్టు నిశ్చయింపఁదగి యున్నది. ఈ మొదటి ప్రతాపరుద్రుఁడు 1200 వ సంవత్సరప్రాంతము వఱకును రాజ్యపాలనము చేసెను. బుద్దా రెడ్డికూతురైన కుప్పమాంబ తన చరమవయస్సులో నావఱకే మృతుఁడైన తన భర్త పేర బూదపూరిలో (శాకాబ్దే వసునందశంకర మితే శ్రీధాతృ సంవత్సరే) శకసంవత్సరము 1198 కి సరియైన క్రీ.శ.1136 ధాతృ సంవత్సరమున లింగ ప్రతిష్ఠ చేసి యనేక భూదానములు చేసి శాసనము వ్రాయించెను. ఈ కుప్పమాంబ కోన బుద్దారెడ్డి కూఁతురని చూపుటకయి యీ శాసనములోని యీ క్రింది శ్లోకము నుదాహరించుచున్నాను.

             'శ్రీగోనవంశ నిజ శేఖరబుద్ధయాఖ్య
              పతీ పవిత్రచరితా భరితా గుణౌఘైః
              శృంగారసారకరణిః కరణీయదక్షా
              కుప్పాంబికాజని చ తస్య సతీ కళత్రమ్.'

రంగనాధరామాయణము రచియింపఁబడిన కాలమున కీమె పుట్టెనో లేదో. ఎట్లయినను రంగనాధరామాయణము 12౩౦-40 వ సంవత్సరప్రాంతముల యందు రచియింపఁబడి యుండును. ఇది తిక్కన యుత్తర రామాయణ రచనమున కిరువది ముప్పదియేండ్ల ముందు. తిక్కనపితామహుఁడైన మంత్రి భాస్కరుఁడు రామాయణమును రచించుటవలనఁ గాకపోయినను రంగనాధుఁడు రామాయణమును రచించుటవలన నైనను సోమయాజి పూర్వరామాయణమును మాని యుత్తరరామాయణమును రచియించి యుండును.