250
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సోమనాథకృత మయిన బసవద్విపదను పద్యకావ్యమును గా రచింపు మని పిడుపర్తి సోమనాథకవితో నాతని తండ్రి బసవన్న చెప్ప సందర్భమున నిట్లనెను.
సీ. విరచించె జైమిని వేదపాదస్తవం
బొకపాదమునను వేదోక్తి నిలిపి
హరభక్తి వైదికం బనిశ్రుతు లిడి చెప్పెఁ
బ్రతిభ సోమేశు డారాధ్యచరిత
సరవి శ్రీనాధుఁ డాచరిత పద్యప్రబం
ధము చేసె ద్విపదలు తఱచు నిలిపి
యాతండు పద్యకావ్యము చేసె నైషధ
మంచితహర్షవాక్యములఁ బెట్టి
సోమగురువాక్యములఁ బెట్టి భీమసుకవి
గరిమ బసవపురాణంబు గణనఁజేసె
గానఁ బూర్వకావ్యము చేరుగతి రచించు
వారి కాదికావ్యోక్తులు వచ్చి నెగడు.'
ఈ భీమకవిచేసిన బసవపురాణము కన్నడభాషలో, పాల్కురికి సోమనాథ విరచిత మయిన యనుభవసారమునుండి కొన్ని పద్యములఁ జూపి,తత్కృతములయిన బసవపురాణ పండితారాధ్యచరితములనుండి శైలిని సూచించు చిన్నభాగముల నుదాహరించి, యిూ కవిచరితమును ముగించు చున్నాను.
అనుభవసారము
చ. 'ముదము వహింప హేతువులుముప్పదియై మది నొప్పుఁ బెంపు నన్
మృదుమధురోక్తు లింపడర మెచ్చులు దీటుకొనంగ నర్ధసం
పద దళుకొత్త సాంగముగఁ బామరు లుల్లము పల్లవింప న
ట్లెదురుభజింప భక్తి వలదే శివభక్తి కథాప్రసంగతిన్.
చ. అవిరళలింగపూజయు, నిరంతర సద్గురుభక్తియున్
సవినయజంగమార్చనయు సత్యము శౌచము సచ్చరిత్రమున్