Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

పాలకురికి సోమనాథుఁడు

         రగడ గంగోత్పత్తిరగడ శ్రీ బసవాఢ్య
                        రగడయు సద్గురురగడ చెన్న
            మల్లు సీసములునమస్కారగద్య వృ
                        షాధిపశతకంబు నక్షరాంక

            గద్యపద్యము ల్పంచ ప్రకారగద్య
            యష్టకము పంచకము నుదాహరణయుగ్మ
            మాది యగు కృతు ల్భక్తిహితార్థబుద్ధిఁ
            జెప్పె నవి భక్తసభలలోఁ జెల్లుచుండు.

ఈ కవిగ్రంధములలో బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, అనుభవ సారము తెలుగు, అన్యవాదకోలాహలము, బసవనపంచగద్య, సోమనాథ భాష్యము, సంస్కృతము; తక్కినవి కన్నడము [1]

  1. [ సోమనాథుఁడు 10 తెలుఁగు గ్రంథములను, 10 సంస్కృతగ్రంథములను, 4 కన్నడ గ్రంథము లను రచించెనని ఆంధ్రకవి తరంగిణిలోఁ గలదు. ఆంధ్ర గ్రంథములు . బసవ పురాణము, పండితారాధ్య చరిత్రము, మల్లమ దేవీ పురాణము, సోమనాథ స్తవము, అనుభవసారము, చెన్నమల్ల సీసములు, వృషాధిప శతకము, చతుర్వేదసారము, బసవోదాహరణము, బసవరగడ సంస్కృత గ్రంథములు - సోమనాథ భాష్యము, రుద్ర భాష్యము ; వృషభాష్టకము, బసవోదాహరణము , అష్ణోత్తర శతనామగద్యము , నమస్కార గద్యము, పంచప్రకార గద్యము, అక్షరాంక గద్యము. కన్నడ గ్రంథములు - బసవరగడ, బసవాఢ్యరగడ, సద్గురురగడ గంగోత్పత్తి రగడ–ఇయ్యవి తెనుఁగుకృతులో, కర్ణాటకృతులో చెప్పఁ జాలమని శ్రీ బండారు తమ్మయ్య గారు వ్రాసిరి. రగడలు తెలుఁగు సంప్రదాయమునకు సంబంధించినవను నాశయమున, శ్రీ తిమ్మయ్య"గా రట్లనియుండ వచ్చును. అక్షరాంక గద్యనే కాక, అక్షరాంక పద్యములనుగూడ సోమనాథుడు వ్రాసెననియు 'శీల సంపాదనము', శివగణ సహస్రనామము నను "రెండు కన్నడ కృతులను కూడ ఈతcడు రచించెననియు, శ్రీ వేంకటరావు గారు తమ 'తెనుఁగు కవుల చరిత్ర' లో వ్రాసియున్నారు. ఈ రచనలలో మొదటిది 'అనుభవసారమ'నియు అది నన్నయభట్టు కవితా సంప్రదాయముల ననుసరించినదనియు, శైవకవితా సంప్రదాయము లందు లేవనియు తెల్పుచు శ్రీ వేంకటరావుగారు తర్వాతి రచనలను క్రమముగా నిట్లు నిరూపించిరి_ బసవపురాణము. వృషాధిప శతకము, గద్య కృతులు, పద్య స్తుతులు, చతుర్వేద సారము, భాష్య గ్రంథములు, సంస్కృత స్తుతులు, పండితారాధ్య చరిత్రము,