పుట:Aandhrakavula-charitramu.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

240

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

        
          సింధుజలౌఘధారి సురసిద్దమునీంద్రగజకోపకారి ను
          ద్బంధవిదారి నోఁబలుక బ్రాహ్మణనీవధికారివే మహిన్. [ ఆ. 28 ]
  
       సీ. దుగ్ధాంబునిధి నిట్టఁ దోఁచెనో యని శేషు
                    బాన్పుగా హరి నీటఁ బవ్వడింపఁ
          నొదవి సుధారస ముప్పొంగెనో యని
                    దేవతల్ దని వోవఁ ద్రావఁ దలఁపఁ
          దొలఁకాడుమిన్నేఱు వెలివిరిసెనో యని
                    లీల సురాంగన లోలలాడఁ
          బాదరసం బుర్విఁ బరఁగెనో యనిసిద్ద
                    నికరంబు కలశముల్ వించి కొనఁగఁ

          బాండురాంగుండు విశ్వరూపంబు దాల్చి
          యెలసెనో యని సద్భక్తు లెలమిఁ గొలువ
          నఖిలజీవుల కానంద మతిళయిల్ల
          నచ్చవెన్నెల విమలమై యలరి కాసె. [ఆ. 8-118 ]

      ఉ. బాలకుఁ బట్టియే సురలు బల్విడి నాపయి నెత్తి రింతయే
          నేలిదమైతినే తమకు నెన్నఁడు మద్భుజవిక్రమక్రమా
          భీలకరాళఖడ్గవరభీషణవేషము చూచి నేలపైఁ
          గా లిడి నిల్తురే యనికిఁ గ్రమ్మఱ వత్తురె వృత్తి సోత్తురే [ఆ. 10-149 ]


                    2. కళా విలాసము[1]

      సీ. పృధులవిశ్వంభరారథమున కెదురుగాఁ
                   బూన్పించె నెవ్వాఁడు పువ్వుcదేరు

  1. ఈ పద్యములు శ్రీ రామకృష్ణకవిగారి కుమారసంభవపీఠిక నుండి గ్రహింపఁబడినవి. లక్షణగ్రంధములయం దుదాహరింపఁబడిన కొన్ని పద్యములె కాని పుస్తకము సమగ్రమముగా నెవ్వరికిని లభింపలేదు. అందుచేత నీ యాంధ్రకళావిలాసము క్షేమేంద్రుని సంస్కృత కళావిలాసముతో నెంత వఱకు సంబంధించి యున్నదో తెలిసి
    కొనుట శక్యము కాదు.