పుట:Aandhrakavula-charitramu.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

239

న న్నె చో డ క వి

పరకాంతలు శివునిఁ జూడ వచ్చెననుటకు మాఱుగా యోగియైన జంగమ మల్లయను జూడ వచ్చిరనుట కొంత యసంగతముగా నున్నదేమో ! ఈ కవి శృంగారవర్ణనము నం దత్యాస_క్తి కలవాఁడు ఇతఁ డష్టమాశ్వాసములో విటాభిసారికాలంజి కాదుల నేఁబది పద్యములకంటె నెక్కుడుగా వర్ణించెను. కవికవిత్వశై_లి తెలియుటకై యీతని గ్రంథములనుండి కొన్ని పద్యముల నుదాహరించుచున్నాను.

                         
                          1. కుమారసంభవము
         
         చ. అతని శరాసనంబు కనకాచల, మిక్షుశరాసనంబు నీ,
             కతనికి నమ్ము పాశుపత, మంటినఁ గందెడు పువ్వటమ్ము నీ,
             కతఁడు పురాపహారి, విరహాతురపాంధజనాపహారి నీ.
             వతనికి నీకు హస్తిమశకాంతర మె మ్మెయి నెన్న చూచినన్.
                                                        [ ఆ.4-32 ]
 
         సీ. బాల నీవేనలి కాలోరగంబుని
                         మలయానిలంబు నీవలన రాదు
             కమలాస్య నీకనుఁగవ చకోరము లని
                         వెన్నెల సొరదు నీయున్నయెడకు
             నబల నీయెలుఁగు పికారావ మని నీకుఁ
                         జూతమ్ము కొమ్ములు చూప వెఱచుఁ
             జపలాక్షి, నీముక్కు చంపక మనుభీతి
                         నలులు నీపొడ గని యలయఁ బాఱు
    
             వనిత నీకుఁ బ్రాణవల్లభుండై మది
             నొలసె శివుఁడు పాయకుండు ననియె
             పేదమరుపశరములు నీదెశ రా నోడు
             వీని కేల నీవు వెఱచె దమ్మ [ఆ. 5 - 165 ]

         ఉ. గంధగజాసురారిఁ బురకాయజకాలబల ప్రహారి ను
            గ్రాంధకహారిఁ దీ వ్రగరళాయతవహ్ని విహారి దేవతా