పుట:Aandhrakavula-charitramu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

డను కవి సంస్కృతమున వేఱొక కుమారసంభవమును జేసినట్టు కవి యీ క్రింది పద్యమునఁ జెప్పి యున్నాఁడు

      క. క్రమమున నుద్భటుఁడు గవి
         త్వము మెఱయc గుమారసంభవము సాలంకా
         రము గూఢవస్తుమయకా
         వ్యముగా హరులీల చెప్పి హరు మెప్పించెన్. [ ఆ. 1 -21 ]

ఈ రెండు కుమారసంభవములను జదివి కావలసినచో వానినుండి కధను గైకొనుచు తనమనసు వచ్చినట్టు మార్చి పెంచి సురుచిర వర్ణనాలంకారబంధురముగా నన్నెచోడుఁ డీ యాంధ్రకుమారసంభవమను కావ్యమును రచించెసు. ఇందు పండ్రెండాశ్వాసములు గలవు; ఈ పండ్రెండాశ్వాసములలోను సుమారు రెండువేల పద్యము లున్నవి. ఇది తన పరమార్థవిద్యాగురువైన జంగమ మల్లికార్జునయోగి కంకితము చేయఁబడినది. ఆశ్వాసాద్యంతపద్యములలోఁ గొన్నిచోట్ల నతఁడు శివుని కభేదముగా వర్ణింపఁబడుటయే గాక గ్రంథమధ్యమునందు సహిత మీ పద్యములలో నట్లే విరుద్దముగా వర్ణింపఁబడెను.[1]

      చ. 'కమలదళాక్షి చాలఁ దమకంబునఁ గూర్పునిజేశుతోడఁ జి
          త్తము దనివోవఁగా బహువిధంబులఁ గూడిన హృద్గతానురా
          గము వెలిఁ జేర్చెనో యన నఖక్షతచుంబనరంజితాంగవి
          భ్రమగతి వచ్చి చూచె నొకభామిని జంగమమల్లికార్జునున్.

      గీ. మగువ జంగమ మల్లఁయఁ దగిలి చూచి
          యంద కన్నులు మనమును నంటి యున్న
          నచలభావన నిల్చెఁ దా నట్ల పరము
          నభవుఁ గని జను లచలాత్ము లగుట యరుదె'
                                               [ ఆ.8-ప.61 - 62 ]

  1. [జంగమమల్లి కార్జునుఁడు శివున కభిన్నుఁడని తలఁచినపుడు ఇట్టివర్ణన విరుద్ధమని భావింపనక్కఱ లేదు ]