పుట:Aandhrakavula-charitramu.pdf/264

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

న న్నె చో డ క వి

అను ద్వాదశాశ్వాసము లోని పయి పద్యమునందు 'తొడరాడి " అనియు క్త్వార్ధకసంధులు గానవచ్చుచున్నవి.[1]

     క. ఏసియు వై చియుఁబొడిచియు
        వేసర కొండూరుల బట్టి విడువక కేశా
        కేశిఁ బెనంగుచుఁ బోర మ
        హాసురముగఁ బోరి రా సురాసురవీరుల్." [ ప. 168 ]

అను ద్వాదశాశ్వాసములోని పద్యమునందు శసప్రాసము వేయఁబడినది.

    చ. 'పుడమిపడున్ ధనాఢ్యుఁడునుభూరిబలుఁడును శౌర్యవంతుఁడున్
         గడుదృఢపాణిపద్ముఁడును గాక యొడంబడ దశ్వమేధ మిం
         దడరఁగ జేయుc దన్మఖమునందులపుణ్యఫలంబు లందఁగా
         నడుగడుగశ్వమేధ మనునాజి మొనం జని చావు సేగియే. [ప. 44 ]

అనెడి యేకాదశాశ్వాసపద్యములో 'పుడమి పుఁడున్” అని గ్రామ్యపద ప్రయోగము చేయఁబడినది.
 
     చ. అరుణజలంబు లాడి తురగాజినవస్త్రము లర్థిఁ గట్టి భీ
         కరకరిదానకర్దమము కస్తూరిగాఁగ నలంది వీరహృ
         త్సరసిరుహంబు లోలి నవతంసవిభూతిగఁ దాల్చి చాల న[2]
         చ్చరువుఁ బిశాచ కాంతలు పిశాచములందవిలించి రొప్పులన్,
                                                  [ ఆ.11 - 202 ]

అను పద్యములో నచ్చెరు వని యుండవలసినదాని కచ్చరు వని యపశబ్దము వేయబడినది.

ఈ కవి చేసిన గ్రంథములు రెండు అందొకటి కుమారసంభవము, రెండవది కళావిలాసము. కాళిదాసుఁడు చేసిన కుమారసంభవము గాక యుద్భటుఁ

  1. [* ఇట్టివి శబ్దపల్లవములైనఁ గావచ్చును. క్వార్థకములని యనుకొన్నను.అట్టివాని సంధిని పెక్కు రామోదించి యున్నారు.]
  2. [ నచ్చరున - పాఠము. అచ్చరువు 'అచ్చెరువు' నకు రూపాంతరము కాని అపశబ్దము కాదు.]