పుట:Aandhrakavula-charitramu.pdf/263

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది

236

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

మయి యున్నది. ఇతఁడు నాచన సోమనాథాది మహాకవులతోఁ దులఁదూగదగినవాఁడు గాని సాధారణుఁడు కాఁడు. ఈతని కవిత్వమునందు క్వార్ధక సంధులు మొదలైన కొన్నియల్పదోషము లున్నవి కాని యవి రత్నాకరములోని నత్తగుల్లలవలె నంతగాఁ బాటింపఁదగినవి కావు. కన్నడభాషాపద సమ్మేళనము మాత్రము శ్లాఘ్యము గాదు.[1]

      సీ. పింఛాతపత్రముల్ పెనఁగి మరుద్వీధిఁ
                       గార్కొను నీలమేఘములు గాఁగ
          వివిధభూషారత్న వివిధాcళజాలముల్
                      సదమలాఖండల చాపములుగ
          ఘనవీధిఁ బొలసాడు ఖచరాంగనాపాంగ
                      తరళాక్షరుచులు సౌదామనులుగ
          సింధురోన్నత కరశీక రాసారముల్
                      ధారుణిఁ గురియు నాసారములుగ

    ఆ వె. సంచితంబులైన పంచమహాశబ్ద
          రవము లులియ మేఘరవము లెసఁగ
          హరుఁడు పచ్చె రజత్తగిరి కుమాన్వితము గ్రొ
          క్కారులీలఁ గరము గారవమున [ఆ. 9 - 141]

అను నవమాశ్వాసములోని యీ పద్యమునందు "పొలసాడు" అనియు,

      చ. 'నిజవదనామితాసితమణీకచనీలవిభాతివాహన
          ద్విజవరబర్హిబర్హ విత తిం దొడరాడి సముల్ల సిల్లన
          త్యజిత విలాసలీల విజయధ్వజ మంబరవీథిఁ గుక్కుట
          ధ్వజముఁ బెనంగఁ బొల్పెసఁగి వచ్చెను మహేశ్వరసూతి ప్రీతితోన్
                                                               [ప 203]

  1. [అట్టివి కన్నడ పదము లనుటకంటె - అప్పు డాంధ్రభాషలో వ్యవహారముననున్న పదములే యని యనుకొనవచ్చును.]