పుట:Aandhrakavula-charitramu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

235

న న్నె చో డ క వి

అను కన్నడలక్షణము ననుసరించెను. ఇది నాగవర్మఛందోంబుధిలోని క్రౌంచపదలక్షణము. ఈ నాగవర్మ సుమారు 660 వ సంవత్సరము నాటి వాఁడు. తెలుఁగులక్షణములోని కడపటి యగణమునకు బదులుగా కన్నడ లక్షణములో నగ మున్నది. కడపటి నగణములోని తుది రెండు లఘువుల నొక గురువునుగాఁ జేసినయెడల నది తెలుఁగులక్షణముతో సరిపోవును. సుప్రసిద్ధకర్ణాటకలక్షణకర్త యయిన యీ నాగవర్మ తాను వేఁగి దేశపువాఁడ నని తన ఛందోంబుధియం దీ క్రింది పద్యములలోఁ జెప్పకొని యున్నాఁడు


      క. జగదొొళగిదొందుమిగిలెనె
         నెగళ్దిర్దుదువేంగివిషయమావిషయదొళా
         శ్రగణిత మెనె సప్తగ్రా
         మగళొళమావేంగిపళుకరం సొగయిసుగుం 4

      క. ఆవేంగి పళువినోశ్విభు
         దేవసమానంవిదగ్ధనంబుజభవనం
         తావగమొళ్గుణనిధియం
         తీవసుధెయె ళెనిసి వెణ్నమయ్యంనెగళ్దం. 5

      క. వేదదొళనుగత రెనిసువ
         వేదగళొళ్ నిపుణనాగినెగళ్దంగంభీ
         రోదోన్న తెపరివేష్టిత
         మేదినియొళ్ పెణ్ణమయసకలంకగుణం. 6

ఈ నన్నెచోడకవి మన వా రనుకొన్నంత పూర్వుఁడు కాకపోయినను గొంత పూర్వుఁడే యయి నన్నయభట్టునకు, తిక్కనసోమయాజికిని నడిమి కాలమునం దుండినవాడయి నన్నయభట్టారకుఁడు బ్రాహ్మణకవులలో నగ్రగణ్యుఁ డయినట్టే రాజ కవులలో నగ్రగణ్యుఁ డయియున్నాఁడు. ఇతడు 1150-వ సంవత్సరప్రాంతమునుండి దాదాపుగా 1150-70 -వ సంవత్సరప్రాంతములవఱకు నుండి యుండును. ఈతని కవిత్వము మొత్తముమీఁదరసవంత మయి యసాధారణ ధార కలదయి హృదయంగమ